MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీ కళ్లు ఎప్పుడూ ఎర్రబడే ఉంటున్నాయా? కారణాలు ఇవే..!

మీ కళ్లు ఎప్పుడూ ఎర్రబడే ఉంటున్నాయా? కారణాలు ఇవే..!

ఎప్పుడూ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీ చూడటం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్లు కూడా ఎర్రబడతాయి. కళ్లు ఎర్రబటానికి స్క్రీన్ యే కాకుండా వేరు కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 04 2022, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కళ్లు చాలా సెన్సిటీవ్. వీటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే.. మన కంటి చూపు అంత మెరుగ్గా ఉంటుంది. కంటిచూపు బాగుండాలన్నా.. కళ్లు  ఆరోగ్యంగా ఉండాలన్నా..ఫోన్, ల్యాప్ టాప్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూసే టైంను తగ్గించుకోవాలి. అయితే కొంతమంది కళ్లు ఎప్పుడూ ఎర్రబారే ఉంటాయి. కంటినిండా నిద్రలేకపోతే కూడా కళ్లు ఎర్రబడుతాయి. అలాగే  ఎదైనా అనారోగ్య సమస్య ఉంటే కూడా కళ్లు ఎర్రగా మారుతాయి. తరచుగా కళ్లు ఎర్రగా మారడానికి కారణాలేంటో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వైరల్ కండ్లకలక

ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీనినే మనం కండ్ల కలక అంటాం. కండ్లకలక వల్ల కండ్ల వాపు వస్తుంది. దీనివల్ల కనుగుడ్డుపై సన్నని పొర ఏర్పడుతుంది. ఇది కన్నును పూర్తిగా కప్పి ఉంచుతుంది. దీంతో కళ్లు ఎర్రబడటమే కాదు.. నొప్పి కూడా పెడుతుంది. మంటగా కూడా అనిపిస్తుంది. అలాగే వాపు కూడా ఉంటుంది. ఇవి వైరల్ కండ్లకలక సంకేతాలు. ఇలాంటి సమయంలో డాక్టర్ ను సంప్రదించడం మంచిది. 
 

36

కోవిడ్-19

కోవిడ్ నుంచి కోలుకున్నా..  దీని లక్షణాలు మాత్రం కొందరిలో చాలా కాలం వరకు ఉంటాయి. వీటివల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఫేస్ చేస్తున్నవారిలో కూడా కండ్లు ఎర్రబడతాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ కండ్ల నుంచి శరీరంలోకి ప్రవేశించిన వారిలో కండ్లు ఎర్రబడతాయట. కరోనా వచ్చి తగ్గిపోయినా కండ్లు ఎర్రబడితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

46

అలెర్జీలు

ముక్కుకు సంబంధించిన అలెర్జీలతో ఇబ్బంది పడేవారు చాలా మందే ఉన్నారు. ఈ అలెర్జీలకు ప్రధాన కారణం ముక్కు ద్వారా దుమ్ము, దూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలను పీల్చడం. ఈ అలెర్జీల వల్ల కూడా కండ్లు ఎర్రగా మారతాయి. అలాగే కళ్లలో మంట, దురద వంటి సమస్యలు కూడా వస్తాయి. 

56

కాంటాక్ట్ లెన్సులు

మీరు కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తున్నట్టైతే వాటిని శుభ్రంగా ఉంచుకోండి. పాతవి వాడటం మానేయాలి. పగిలిపోయినవి కూడా వాడకూడదు. పై వాటిలో ఏ ఒక్కటి మీరు పాటించకపోయినా.. మీ కంటి ఆరోగ్యం దెబ్బతిని ఎర్రగా మారుతాయి. నిద్రపోయేటప్పుడు కూడా వీటిని ధరించడం వల్ల కూడా కండ్లు ఎర్రగా మారుతాయి. 
 

66

డ్రై ఐ సిండ్రోమ్

ఎక్కువ సేపు కంప్యూటర్, ల్యాప్ టాప్, ఫోన్ స్క్రీన్ ను చూడటం వల్ల కూడా కండ్లు పొడిబారుతాయి. దీనివల్ల కూడా కండ్లు ఎర్రగా మారుతాయి. అలాగే ఎక్కువ సేపు కంటి రెప్పలను వాల్చకపోవడం వల్ల కూడా కండ్లు డ్రై అయిపోతాయి. అందుకే తరచుగా కళ్లను మూస్తూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడు ఐ డ్రాప్స్ ను కూడా వాడుతూ ఉండాలి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Watch Bracelet: ట్రెండీ వాచ్ బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో చూడండి!
Recommended image2
Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు
Recommended image3
Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved