MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Avoid Cauliflower: కాలీఫ్లవర్ వంటకాలు టేస్టీగానే ఉంటాయి, కానీ వీరు మాత్రం తినకూడదు

Avoid Cauliflower: కాలీఫ్లవర్ వంటకాలు టేస్టీగానే ఉంటాయి, కానీ వీరు మాత్రం తినకూడదు

కాలీఫ్లవర్ అధికంగా దొరికే కాలం ఇది. మార్కెట్లో కాలీ ఫ్లవర్ అమ్మకాలు జోరుగా సాగుతాయి. దీంతో చేసే గోబీ మంచూరియా, గోబీ రైస్, కూరలు, వేపుళ్లు చాలా రుచిగా ఉంటాయి. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు మాత్రం వీటిని తినకూడదు.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 09 2025, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కాలీఫ్లవర్ మంచిదే కానీ
Image Credit : Getty

కాలీఫ్లవర్ మంచిదే కానీ

కాలీఫ్లవర్ తో చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. అందులోనూ ఇది సీజనరల్ గా దొరికేది. కాబట్టి  అందరూ ఇష్టంగా తింటారు. వానాకాలం నుంచి చలికాలం వరకు మార్కెట్లలో దీన్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. దీనిలో పోషకాలు కూడా ఎక్కువే. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, ఫైబర్, భాస్వరం, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. కాలీఫ్లవర్‌లో ఎన్ని పోషకాలున్నా కూడా కొంతమంది మాత్రం దీన్ని తినకూడదు. ఎవరెవరు కాలీఫ్లవర్ తినకూడదో తెలుసుకోండి.

27
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు
Image Credit : Getty

గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు

కొంతమందికి గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. అలాంటి వారు కాలీఫ్లవర్ తినకండి. ఎందుకంటే దానిలో ఉండే కార్బోహైడ్రేట్ సులభంగా జీర్ణం కాదు, జీర్ణ సమస్యలను మరింతగా పెంచేస్తుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్య మరింతగా ముదిరిపోయే అవకాశం ఉంది.

Related Articles

Related image1
కాలీఫ్లవర్ అంటే ఇష్టమా.. అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
37
మలబద్ధకం
Image Credit : Getty

మలబద్ధకం

మీకు మలబద్ధకం సమస్య ఉందా? అయితే ఎట్టి పరిస్థితుల్లో కాలీఫ్లవర్ తినకూడదు. ఈ కూరగాయ మీకున్న మలబద్ధకం సమస్యను మరింతగా పెంచేస్తుంది.

47
థైరాయిడ్
Image Credit : Getty

థైరాయిడ్

మహిళల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువైపోతోంది. మీకు కూడా థైరాయిడ్  కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే మీరు కాలీఫ్లవర్ తిన్నప్పుడు అది మీ థైరాయిడ్ గ్రంథిలో T3, T4 హార్మోన్లను పెంచుతుంది. అందుకే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదని చెబుతారు. అలా కాలీఫ్లవర్ తింటే థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత ఇతర సమస్యలకు కూడా కారణమవుతుంది.

57
కిడ్నీ స్టోన్స్
Image Credit : Getty

కిడ్నీ స్టోన్స్

కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నవారు కూడా కాలీఫ్లవర్ తినడం మానుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల అది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింతగా పెంచుతుంది. అలాగే కాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినడం మానుకోవడం మంచిది.

67
అధిక రక్తపోటు
Image Credit : Getty

అధిక రక్తపోటు

కాలీఫ్లవర్ తినడం వల్ల రక్తం ఎక్కువగా గడ్డకడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికే రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కాలీఫ్లవర్ తినకండి. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినడం మానుకోవాలి. 

77
పాలిచ్చే తల్లులు
Image Credit : Getty

పాలిచ్చే తల్లులు

పాలిచ్చే తల్లులు కాలీఫ్లవర్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే కాలీఫ్లవర్ తిన్న తరువాత ఆ తల్లి పాలు తాగే బిడ్డకు కడుపు నొప్పి, గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఫిక్స్ చేయడం ఇంత ఈజీనా? రెగ్యులేటర్ పట్టకపోతే ఇలా చేయండి..
Recommended image2
Dosa: పిల్లలు మారాం చేయకుండా తినాలంటే..ఈ కలర్ ఫుల్ దోశెలు ట్రై చేయండి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే
Recommended image3
Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు
Related Stories
Recommended image1
కాలీఫ్లవర్ అంటే ఇష్టమా.. అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved