Sprouted Onions: మొలకెత్తిన ఉల్లిపాయలు వండొచ్చా? వాటిని తింటే ఏమవుతుంది?
Sprouted Onions: ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటారు. అందులో కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ రోజులు అయితే మొలకెత్తుతూ ఉంటాయి. వీటిని వంటల్లో వాడవచ్చా? లేదా? అనే సందేహం ఎక్కువమందికి ఉంది. వాటిని తినడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?

మొలకెత్తిన ఉల్లిపాయలు
ఉల్లిపాయలు లేకుండా ఏ కూర సిద్ధం కాదు. చాలా ఇళ్లల్లో నెలరోజులకు సరిపడా ఉల్లిపాయలను కొని పెట్టుకుంటారు. ఎక్కువ రోజుల పాటూ వీటిని ఇంట్లో ఉంచితే అవి పచ్చని మొలకలు వస్తాయి. అసలు ఉల్లిపాయలు ఎందుకు మొలకెత్తుతాయి? వాటిని తినడం మంచిదేనా కాదా? అనే సందేహాలు ఎక్కువ మందిలో ఉంటాయి. ఉల్లిపాయలకు సహజంగానే మొలకెత్తే లక్షణం అధికంగా ఉంటుంది. తేమగా ఉన్న చోట, గాలి సరిగా తగలని చోట, వేడి వాతావరణంలో ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తుతాయి.
ఈ ఉల్లిపాయలు సేఫేనా
ఉల్లిపాయ పక్వానికి రాగానే ఉల్లిపాయ పైభాగంలో ఆకుపచ్చని మొలక బయటకు వస్తుంది. అదే మొలకెత్తిన ఉల్లిపాయ అవుతుంది. దీన్ని వంటలో వాడవచ్చా లేదా అనే సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా సురక్షితం. కాకపోతే మొలకెత్తిన తరువాత ఉల్లిపాయలోని పోషకాలు, రుచి ఆ మొలకలకు కొంతవరకు వెళ్లిపోతాయిి. అయితే దాని రుచి, వాసన కొంతమందికి నచ్చదు. కానీ వీటిని వంటలో వాడే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది.
ఈ ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు
మొలకెత్తిన ఉల్లిపాయల రుచి, వాసనే కాదు అందులో ఉండే పోషకాలు కూడా మారుతాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఉల్లిలోని ఖనిజాలు అలాగే ఉంటాయి. అయినా వంటలో వాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సలాడ్ లలో ఇలాంటి ఉల్లిపాయలు తీసుకోకపోవడమే ఉత్తమం. అలాగే ఆ మొలకలను కూడా నేరుగా పచ్చిగా తినకపోవడమే మంచిది.
சுவை மற்றும் மனம்!
తాజా ఉల్లిపాయలతో పోలిస్తే మొలకెత్తిన ఉల్లిపాయల వాసన, రుచి భిన్నంగా ఉంటాయి. కొందరికి దీని రుచి నచ్చకపోవచ్చు. వంటలో మొలకెత్తిన ఉల్లిపాయలను వాడాలనుకుంటే, వండటానికి ముందు దాని మొలకలను తీసేయండి. కావాలంటే మొలకెత్తిన భాగాన్ని కూడా వంటలో చేర్చవచ్చు. అది ప్రమాదకరం కాదు. ఉల్లిపాయ కేవలం మొలకెత్తితే వంటలో వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ అది కుళ్ళిపోయినా లేదా దుర్వాసన వచ్చినా, చెత్తలో పడేయడమే మంచిది. ఉల్లిపాయలు మొలకెత్తకుండా ఉండాలంటే, వాటిని ఎప్పుడూ వెచ్చని ప్రదేశాలలో నిల్వ చేయండి. అలాగే, మంచి గాలి వచ్చే చోట ఉంచండి. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి.

