సెలిబ్రిటీల అనుభవాలు: బ్రా వేసుకుని నిద్రపోతే..!
వయసు పెరుగుతున్న కొద్దీ రొమ్ముల పరిమాణం మారుతుంది. కొన్నిసార్లు అవి చాలా బరువుగా అనిపించొచ్చు. ఇంకొన్ని సార్లు వదులుగా అనిపిస్తాయి. కానీ బ్రా ధరిస్తే రొమ్ముల్లో ఇలాంటి మార్పులు రావని చాలా మంది అనుకుంటారు. మరి దీనిలో నిజమెంతుందంటే?
బ్రా వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. బ్రాలు మీరు అందంగా కనిపించడానికి సహాయపడతాయి. అలాగే రొమ్ములను ఫిట్ కనిపించేలా చేస్తాయి. అయితే ఈ మధ్య కొందరు హాలీవుడ్ సెలబ్రిటీలు బ్రా వేసుకుని నిద్రపోవడం గురించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. అలాంటి సెలబ్రిటీల్లో ఒకరైన టైరా బ్యాంక్స్.. బ్రా రొమ్ములను కిందికి జారనీయదు అని చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది బ్రా ధరించడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతుంటారు. బ్రాలు రొమ్ము తిమ్మిరిని నిరోధిస్తుందనడానికి నిజమైన ఆధారాలు లేవని కొంతమంది పేర్కొన్నారు. మరి దీని గురించి నిపుణులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం పదండి..
బ్రెస్ట్ స్కగ్గింగ్ కోసం బ్రా డిజైన్ ఎలా ఉంటుంది?
బ్రెస్ట్ వర్టికల్ పొజిషనింగ్ కు సహాయపడే విధంగా బ్రాను డిజైన్ చేస్తారు. ఇది వక్షోజాలను పైకి నెట్టి కిందకు వేలాడకుండా చేస్తుంది. పడుకున్నప్పుడు వక్షోజాలు ఒక సైడ్ కు వంగుతాయి. అయితే రాత్రిపూట బ్రాను ధరించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది వక్షోజాలను లోపలకు కాకుండా పైకి నెట్టడానికే తయారు చేయబడింది. అయితే బ్రా లను వేసుకుని పడుకోవడం వల్ల రొమ్ము కణజాలంపై ఒత్తిడి తగ్గుతుంది.
రొమ్ము తిమ్మిరి ఎందుకు వస్తుంది?
నిపుణుల ప్రకారం..రొమ్ము తిమ్మిరికి ప్రధాన కారణం జెనెటిక్స్, వయస్సు, చర్మ స్థితిస్థాపకతలో మార్పులు. వృద్ధాప్యం నుంచి చర్మ స్థితిస్థాపకత తగ్గడం మందగించడం వరకు దీనికి ప్రధాన కారణాలు. ముఖ చర్మంలాగే వక్షోజాల చుట్టూ ఉన్న చర్మం కూడా వృద్ధాప్యం బారిన పడుతుంది. దీనివల్ల చిన్న వక్షోజాలు కూడా వదులుగా మారుతాయి. కాలక్రమేణా మన చర్మం మొత్తం స్థితిస్థాపకతను కోల్పోతుంది. ఈ కారణంగా రొమ్ములు కిందికి వేలాడటం మొదలవుతుంది. రొమ్ముల పరిమాణంలో మార్పులు రావడానికి కొవ్వు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వృద్ధాప్యంతో రొమ్ములో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. ముఖ్యంగా రుతువిరతికి ముందు, ఆ సమయంలో. పెద్ద వక్షోజాల్లో కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
రొమ్ములను ఫిట్ గా ఉంచడానికి గ్రంథుల కణజాలం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కణజాలాలు రొమ్ములో పాలు స్రవించడానికి సహాయపడతాయి. ఇవి చాలా సన్నగా ఉంటాయి. కానీ ఇవి బలంగా ఉంటాయి. ఎక్కువ గ్రంధి కణజాలం కలిగి ఉండటం వల్ల రొమ్ము బలంగా, కొద్దిగా వదులుగా ఉంటుంది. వక్షోజాల పరిమాణం బరువుతో మారుతూ ఉంటే.. రొమ్ములు బహుశా ఎక్కువ కొవ్వు కణజాలం, తక్కువ గ్రంథి కణజాలంతో తయారవుతాయి. అంటే రొమ్ములు వదులుగా అయ్యే అవకాశం ఉంది.
నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం మంచిదేనా?
నిపుణుల ప్రకారం.. నిద్రపోయేటప్పుడు బ్రా ధరించాలా? వద్దా? అనేది పూర్తిగా మీ ఇష్టం. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా రొమ్ము ఎదుగుదలను మెరుగ్గా ఉంచొచ్చంటున్నారు నిపుణులు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు పెరగకుండా జాగ్రత్త పడటం, ఎక్కువ సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడం వంటి కొన్ని జాగ్రత్తలు మీ రొమ్ములలో మార్పులను తగ్గిస్తాయి. నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ స్ట్రెగ్గింగ్ ఉండదనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
వ్యాయామం
పెక్టోరల్ కండరాలను బలోపేతం చేసేందుకు ఎన్నో వ్యాయామాలు ఉన్నాయి. ఎవరైనా బ్రా ధరించి నిద్రపోవడానికి ఇష్టపడితే.. దీనివల్ల మీకు ఎలాంటి హాని జరగదు.