ప్రెగ్నెన్సీ టైం లో అన్నం తినడం మంచిదా ? కాదా?
కడుపులో బిడ్డ పెరగుతున్నాడన్నప్పటి నుంచి పుట్టే వరకు గర్భిణులు పోషకాహారమే తీసుకోవాలి. పోషకాహారం వల్లే పిండం బలంగా పెరుగుతుంది.
మొదటి నెల నుంచి బిడ్డ పుట్టే వరకు గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో.. కొన్ని రకాల ఆహరాలు తల్లికే కాదు బిడ్డకు కూడా హాని కలిగిస్తాయి. అందుకే అలాంటి ఆహారాలను అస్సలు తినకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే గర్భంతో ఉన్నప్పుడు అన్నం కూడా తినకూడదని కొంతమంది అంటూ ఉంటారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భిణులు ఏ ఆహారం తీసుకోవాలి? ఏది తీసుకోకూడదు అన్న విషయాలపై ఎన్నో అపోహలు ఉంటాయి. వీళ్లు తీసుకునే ఆహారం తల్లికీ బిడ్డకు సురక్షితమైందిగా ఉండాలి. ఎందుకంటే కడుపులోని బిడ్డను పోషించడానికి, వారిని మోయడానికి తల్లి శరీరానికి తగినంత పోషణ అవసరం. వైట్ రైస్, బ్రౌన్ రైస్ వంటివి గర్భిణులు తినకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి గర్భధారణ సమయంలో బరువును పంచుతాయని, ఎన్నో సమస్యలకు దారితీస్తాయని నమ్ముతారు.
నిజానికి గర్భిణులు అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదే. అయినప్పటికీ.. నిపుణుల సలహాను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో అన్నాన్ని ఎక్కువమొత్తంలో తింటే బరువు పెరుగుతారు. నిజానికి అన్నం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి తెలుసా.. ఎందుకంటే దీనిలో మెగ్నీషియంతో పాటుగా ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ బిడ్డ అభిజ్ఞా అభివృద్ధికి సహాయపడుతాయి. అలాగే తల్లిని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వైట్ రైస్, బ్రౌన్ రైస్ రెండూ గర్భిణుల ఆరోగ్యానికి మంచివే. ఎందుకంటే బియ్యంలో సహజంగా ఫైబర్స్, కాల్షియం, థయామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ డి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే బియ్యంలోని ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు శరీరానికి తగినంత బలాన్ని అందించడానికి సహాయపడతాయి. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే బియ్యంలో కరిగే ఫైబర్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చివరగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మితంగా తీసుకుంటేననే ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది. అందుకే అన్నాన్ని ఎక్కువ మొత్తంలో తినకండి.