MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Induction Cooktops: గ్యాస్ సిలిండర్ టెన్షన్ లేకుండా చవకగా ఈ ఇండక్షన్ స్టవ్ కొనేయండి

Induction Cooktops: గ్యాస్ సిలిండర్ టెన్షన్ లేకుండా చవకగా ఈ ఇండక్షన్ స్టవ్ కొనేయండి

Induction Cooktops: దేశంలో గ్యాస్ కొరత మొదలైపోయింది. ఇరాన్ ఇజ్రాయెట్ యుద్ధం ఎఫెక్ట్ మన గ్యాస్ పై పడింది. ఇలా గ్యాస్ కోసం టెన్షన్ పడేబదులు కరెంట్ స్టవ్ కొనుక్కుంటే మంచిది. ఇక్కడ బెస్ట్ ఇండక్షన్ స్టవ్ ల గురించి ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 13 2026, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గ్యాస్ కొరత వచ్చేసింది
Image Credit : Glen

గ్యాస్ కొరత వచ్చేసింది

దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత ఇబ్బంది పెడుతోంది. అందుకే చాలా హోటల్స్, హాస్టల్స్ కొన్ని ఆహారాలను వండడం ఆపేశారు. సింపుల్ తక్కువ సమయంలో అయిపోయే వంటలే వండుతున్నారు. కానీ ఇంట్లో అలా కుదరదు కదా. ఇంటిల్లిపాదికి చక్కటి రుచికరమైన ఆహారం వండాల్సిందే. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా చవకగా వచ్చే కరెంట్ స్టవ్ కొన్నారంటే గ్యాస్ బాధే లేకుండా వండేసుకోవచ్చు. మార్కెట్లో రకరకాల ఇండక్షన్ కుక్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది కొనాలి, ఏ బ్రాండ్ మంచిది అనే సందేహం ఉందా? ఇక్కడ మేము చవకగా వచ్చే బెస్ట్ ఇండక్షన్ స్టవ్ ల గురించి ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బెస్ట్ ఇండక్షన్ స్టవ్ లు
Image Credit : Glen

బెస్ట్ ఇండక్షన్ స్టవ్ లు

భారత మార్కెట్లో ప్రెస్టీజ్ (Prestige), ఫిలిప్స్ (Philips), పిజియన్ (Pigeon), బజాజ్ (Bajaj) వంటి ఎన్నో ఉత్తమ కంపెనీలు ఇండక్షన్ స్టవ్‌లు ఉన్నాయి.  ఇవి సాధారణంగా 1200W నుంచి 2100W వరకు పవర్ కెపాసిటీతో లభిస్తాయి. వీటిలో ప్రెస్టీజ్, ఫిలిప్స్ మోడల్స్ భారతీయ వంటకాలకు అనువైన ‘ప్రీ-సెట్ మెనూలు’ఉన్నాయి. వీటితో అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీ వంటివి ఒక్క బటన్‌తో సులభంగా చేయొచ్చు. వీటి ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. వీటి ధరలు మూడు వేల రూపాయల నుంచి అయిదు వేల రూపాయలలోపు ఉంటాయి.

ఇక ఉష (Usha), హావెల్స్ (Havells), బటర్‌ఫ్లై (Butterfly) వంటి బ్రాండ్లు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌కు తగిన ధరల్లో ఉన్నాయి.  నాణ్యత విషయంలో ఇవి కూడా మంచివే. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ , సులువుగా శుభ్రం చేయగల గ్లాస్ టాప్ (Glass top) వంటి ఫీచర్లు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవ వీటి ధరలు  రెండు వేల రూపాయలు దాటి ఉంటాయి.

33
అతి చవక ధరలో
Image Credit : Gemini AI

అతి చవక ధరలో

అన్నిటికన్నా తక్కువ ధరలో ఇండక్షన్ స్టవ్ కొనాలనుకుంటున్న వారికి వండర్‌చెఫ్ (Wonderchef), లైఫ్‌లాంగ్ (Lifelong), వి-గార్డ్ (V-Guard) వంటి బ్రాండ్లు ఎంచుకోవడం ఉత్తమం. ఇవి చాలా తక్కువ కరెంట్ ని వాడి వంటను త్వరగా పూర్తి చేస్తాయి.  భద్రత విషయంలోనూ ఇవి గ్యాస్ స్టవ్‌ల కన్నా నమ్మకమైనవి. స్టవ్‌పై పాత్ర లేకపోతే ఆటోమేటిక్‌గా ఆగిపోయే సెన్సార్లు , చైల్డ్ లాక్ (Child lock) వంటివి ఫీచర్లు ఇందులో ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పనిలేదు. ఇక వీటి ధరలు 1000 రూపాయల నుంచే మొదలవుతాయి. ఎల్పీజీ కొరత ఉన్న ఈ సమయంలో, ఒక మంచి ఇండక్షన్ స్టవ్  కొనుక్కోవడం అన్నింటి కన్నా ఉత్తమం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Pimple Patches: మొటిమలు వచ్చాయా? ఈ స్టిక్కర్ పెట్టేసుకోండి.. ఒక్కరోజులో పోతాయి
Recommended image2
Water Bottle: వాటర్ బాటిల్ నుంచి దుర్వాసన పోవాలంటే ఈ చిన్నచిట్కాలతో శుభ్రం చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved