Pimple Patches: మొటిమలతో ఇబ్బంది పడుతున్నవారికి ఈ పింపుల్ ప్యాచెస్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి మొటిమలపై మీద అతికించుకుంటే చాలు… అవి త్వరగా తగ్గిపోవడానికి, వాటిపై బ్యాక్టీరియా చేరకుండా కాపాడటానికి బాగా పనిచేస్తాయి. అసలు వీటివల్ల లాభాలేంటి? ఎప్పుడు వాడాలి వంటివి తెలుసుకోండి.
ఎంతో మంది అమ్మాయిలకు మొటిమల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖం మీద మొటిమలు ఉంటే చూసేందుకు ఏమాత్రం బాగోదు. పైగా ఆ పింపుల్స్ మచ్చలుగా మిగులుతాయి. ఆ పింపుల్స్, మచ్చలు కూడా పోవాలంటే ఇప్పుడు కొత్త స్కిన్ కేర్ ట్రెండ్ వచ్చింది. అదే 'పింపుల్ ప్యాచెస్' (Pimple Patches). చాలామంది అమ్మాయిలు వీటిని వాడాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. వీటిని వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఎలా వాడాలి వంటి విషయాలు ఇక్కడ వివరించాము.
పింపుల్ ప్యాచెస్ చూసేందుకు చిన్న చిన్న ట్రాన్స్‌పరెంట్ స్టిక్కర్లలా ఉంటాయి. ఈ ప్యాచెస్‌ను నేరుగా మొటిమపై అంటిస్తారు. ఇవి మొటిమను కవర్ చేయడమే కాదు, అవి కనిపించకుండా త్వరగా తగ్గేలా చేస్తాయి. ఈ ప్యాచెస్‌ను హైడ్రోకొల్లాయిడ్ (Hydrocolloid) అనే మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇవి మొటిమలు తగ్గేందుకు ఎంతగానో సహాయపడతాయి. ఈ పింపుల్ ప్యాచెస్‌కు ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. మొటిమలోంచి వచ్చే నీరు, జిడ్డును ఈ ప్యాచెస్ పీల్చుకుని, దాన్ని త్వరగా ఎండిపోయేలా చేస్తాయి. వీటిని సరైన పద్ధతిలో వాడితే మొటిమలు త్వరగా తగ్గడమే కాదు, చర్మంపై మచ్చలు కూడా పడకుండా ఉంటాయి.
Also read: లవర్ కోసం ఇంట్లోంచి వెళ్లిపోయిన కుంభమేళా మోనాలిసా,
పింపుల్ ప్యాచెస్ వల్ల లాభాలు
- మొటిమల లోపల ఉండే ద్రవాన్ని, నూనెను ఈ ప్యాచెస్ పీల్చుకుంటాయి. దీనివల్ల మొటిమ వాపు, ఎర్రదనం పోతాయి.
- పింపుల్ ప్యాచెస్ వాడటం వల్ల బ్యాక్టీరియా నుంచి రక్షణ దొరుకుతుంది. బయటి నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా మొటిమపై చేరకుండా ఇది కాపాడుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.
- ముఖంపై వచ్చిన మొటిమను పదేపదే ముట్టుకుంటూ ఉంటారు. ఈ అలవాటును కంట్రోల్ చేయడానికి పింపుల్ ప్యాచెస్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని అంటించడం వల్ల మొటిమను గిల్లడం, నొక్కడం వంటివి మీరు చేయలేరు. కాబట్టి మచ్చలు, గుంతలు ఏర్పడవు.
- ఈ పింపుల్ ప్యాచెస్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. వీటిని వేసుకుని మేకప్ కూడా వేసుకోవచ్చు. లైట్ మేకప్ కింద ఇవి ఉన్నట్టు కనిపించవు. మొటిమ ఉన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు.
Also read: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది
పింపుల్ ప్యాచెస్ కొనేటప్పుడు సాలిసిలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్ లేదా సెంటెల్లా వంటి పదార్థాలు ఉన్న వాటినే ఎంపిక చేసి కొనండి. అలాగే మీ మొటిమ సైజుకు సరిపోయే ప్యాచెస్‌ను ఎంపిక చేసుకోండి. కొనేముందు బ్రాండ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి మంచి ఫలితాలు వస్తాయి.
