పాలిచ్చే తల్లులకు ఈ ఆహారాలు అస్సలు మంచివి కావు
పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు కడుపులో గ్యాస్ ను పుట్టించే ఆహారాలను అసలే తినకూడదు.

పాలిచ్చే తల్లులు తినే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఆహారాలు మంచివి.. ఏవి మంచివి కావన్న విషయాల్లో అవగాహన ఉండాలి. ఎందుకంటే వీటి ఎఫెక్ట్ పాల ద్వారా బిడ్డపై కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సాధ్యమైనంత వరకు కడుపులో గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహారాల జోలికి అసలే వెల్లకూడదు.
కొంతమంది పాలిచ్చే తల్లులు టీ, కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ వీళ్లు టీ, కాఫీ లను తాగకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటిలో ఉండే కెఫిన్ బిడ్డను ఎక్కువసేపు నిద్రలోనే ఉంచుతుంది.
సొరచేపలు కూడా పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే వీటిలో పాదరసం ఉంటుంది. ఇది బిడ్డ మెదడుకు తీవ్రమైన హాని కలిగిస్తుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా తల్లులు తినకూడదు. ఎందుకంటే వీటిలో కోలిక్ వంటి ప్రమాదకరమైన ఎన్నో రసాయనాలుంటాయి. ఇవి బిడ్డకు అలెర్జీని కలిగిస్తుంది.
స్పైసీ ఆహారాలకు పాలిచ్చే తల్లులు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ బిడ్డకు జీర్ణ సమస్యలు, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అంతేకాదు ఇవి వారి ప్రవర్తణలో కూడా మార్పులను తీసుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణులుగా ఉన్నప్పుడు, పాలిచ్చే వారు ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది బిడ్డ ఆరోగ్యంపై, బిడ్డ ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
పాలిచ్చే తల్లులు పాల ఉత్పత్తులను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే పాల ఉత్పత్తులు పిల్లల్లో నిద్రలేమి సమస్యకు దారితీస్తాయి. అలాగే మీ బిడ్డ చర్మానికి సంబంధించిన ఇతర రుగ్మతలను కూడా కలిగిస్తాయి.