MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Parenting: చదువు కాదు.. పిల్లలకు కచ్చితంగా నేర్పాల్సినవి ఏంటి? చాణక్యుడు ఏం చెప్పాడు?

Parenting: చదువు కాదు.. పిల్లలకు కచ్చితంగా నేర్పాల్సినవి ఏంటి? చాణక్యుడు ఏం చెప్పాడు?

Parenting: పిల్లల పెంపకం గురించి ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా? తెలిసీ తెలియకుండా పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలాంటి తప్పులు చేస్తున్నారు? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 07 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Parenting tips
Image Credit : Getty

Parenting tips

పిల్లలకు చదువు చాలా ముఖ్యం. కానీ, చాలా మంది పేరెంట్స్ చదువు మాత్రమే ముఖ్యం అనుకుంటారు. క్షణం తీరిక లేకుండా.. పిల్లలను ఆ క్లాసులు, ఈ క్లాసులు అంటూ పంపుతూనే ఉంటారు. కానీ, పిల్లలు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే చదువు ఒక్కటే సరిపోదు. ముఖ్యంగా పిల్లలతో మంచి స్నేహితుల్లా ఉంటూ.. వాళ్లు ఎన్ని సవాళ్లు అయినా ఎదుర్కోవడానికి కావాల్సిన గుణాలను నేర్పించాలి అని చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నారు. మరి, చాణక్యుని ప్రకారం.. పిల్లలు ఎదిగే క్రమంలో పేరెంట్స్ చేయకూడని తప్పులు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కెరీర్ తో పాటు స్నేహితులు ముఖ్యమే..
Image Credit : Getty

కెరీర్ తో పాటు స్నేహితులు ముఖ్యమే..

చాలా మంది పేరెంట్స్.. పిల్లల ఆసక్తిని అర్థం చేసుకొని మంచి కెరీర్ ఎలా ఎంచుకోవాలనే బాగా గైడ్ చేస్తారు. ఇది చాలా గొప్ప విషయమే. కానీ, మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి అనే విషయం కూడా పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. ఎందుకంటే.. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో.. వారిలాగే ప్రవర్తించడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. స్నేహితుల ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తనను పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. అందుకే.. మంచి స్నేహితులను సెలక్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో పిల్లలకు పేరెంట్సే చెప్పాలి.

Related Articles

Related image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Related image2
Parenting: ప్రతి తల్లి తన కూతురికి పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!
34
మార్కుల కంటే.. వ్యక్తిత్వం ముఖ్యం...
Image Credit : Getty

మార్కుల కంటే.. వ్యక్తిత్వం ముఖ్యం...

ఇంట్లో పేరెంట్స్ ప్రతిసారీ మార్కుల గురించి మాత్రమే మాట్లాడితే.. పిల్లల ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. ఏదో ఒకలా మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ, మార్కులు, విజయం కంటే కూడా వ్యక్తిత్వం గొప్పది అని పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి. మంచి మనిషిగా బతకడం ఎంత ముఖ్యమో.. పేరెంట్సే పిల్లలకు చెప్పాలి.

ప్రైవసీ ఉండాలి..

చాలా మంది పిల్లలు తమ వ్యక్తిగత, కుటుంబ విషయాలను కూడా అందరితోనూ షేర్ చేస్తూ ఉంటారు. కానీ, ప్రతి విషయాన్ని అందరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని పిల్లలు ఎక్కువగా పేరెంట్స్ నుంచి నేర్చుకునే అవకాశం ఉంది. ముందు వారు ఫాలో అయితే.. పిల్లలకు కూడా అలవాటు అవుతుంది.

44
కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం..
Image Credit : Getty

కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం..

చాలా మంది పిల్లలకు ఈ మధ్యకాలంలో మాట అంటే విపరీతమైన కోపం వచ్చేస్తోంది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ఎదుటివారిపై కోపం చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కోపం వస్తే.. దానిని కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయం పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. కోపంలో జారిన మాటను మళ్లీ వెనక్కి తీసుకోలేం అనే విషయాన్ని చిన్నతనంలోనే నేర్పాలి.

చాణక్యుడి సూత్రం ప్రకారం.. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగి, ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి: "నేను మాట్లాడేది నిజమా? ఇది ఎదుటివారికి మేలు చేస్తుందా? ఇది మాట్లాడటం ఇప్పుడు అవసరమా?"

ఆలోచించి మాట్లాడే పిల్లలు పెద్దయ్యాక స్పష్టమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు.

ఫలితాన్ని కాదు.. ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి..

గెలవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ, పోటీచేసిన ప్రతి ఒక్కరూ గెలవలేరు. ఓడిపోయినంతా మాత్రాన వాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. అందుకే, ఫలితాన్ని కాకుండా ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఓటమిని పాఠంగా భావించి మళ్లీ ప్రయత్నించే తత్వాన్ని పిల్లల్లో పెంపొందించండి. పిల్లలు గెలిచినప్పుడు మాత్రమే కాదు.. ఓడిపోయినా వారు పడిన కష్టాన్ని గుర్తించి పేరెంట్స్ ప్రశంసించాలి. ఈ చిన్న ప్రశంసల పిల్లల భవిష్యత్తుకు సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
చిన్నారుల సంరక్షణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Parenting: ప్రతి తల్లి తన కూతురికి పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved