MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • October Travel: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసే బెస్ట్ డెస్టినేషన్స్

October Travel: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసే బెస్ట్ డెస్టినేషన్స్

October Travel: అక్టోబర్ లో వర్షాలు తగ్గి ఆహ్లాదకరమైన వాతావరణం మొదలవుతుంది. దసరా సెలవులు కూడా తోడవడంతో ఫ్యామిలీ ట్రిప్ కు ఇదే సరైన సమయం. ఈ నెలలో ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, హిల్ స్టేషన్లను ఎక్కడెక్కడ చూడొచ్చో తెలుసుకుందాం.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 28 2026, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కోల్‌కతా
Image Credit : gemini ai

కోల్‌కతా

అక్టోబర్ లో వర్షాలు తగ్గి ఆహ్లాదకరమైన వాతావరణం మొదలవుతుంది. దసరా సెలవులు కూడా తోడవడంతో ఫ్యామిలీ ట్రిప్ కు ఇదే సరైన సమయం. ఈ నెలలో ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, హిల్ స్టేషన్లను ఎక్కడెక్కడ చూడొచ్చో తెలుసుకుందాం.

అక్టోబర్ నెలలో కోల్‌కతా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ సమయంలో కోల్‌కతా ప్రజలు దుర్గా పూజల సంబరాల్లో మునిగిపోతారు. రాత్రి పూట నగరం మొత్తం రంగురంగుల దీపాలతో మెరిసిపోతుంది. వెరైటీ థీమ్స్‌తో వేసిన పండల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్, మార్కెట్లను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇదే సరైన సమయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రాజస్థాన్
Image Credit : gemini ai

రాజస్థాన్

అక్టోబర్ నెలలో రాజస్థాన్ ట్రిప్ వేయడం బెస్ట్ ఆప్షన్. ఈ టైమ్‌లో అక్కడ ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఉదయ్‌పూర్‌లోని సరస్సులు, అందమైన ప్యాలెస్‌లను చూడొచ్చు. పిచోలా సరస్సులో బోటింగ్ చేస్తూ, సిటీ ప్యాలెస్‌ను సందర్శించడం మంచి అనుభూతిని ఇస్తుంది. అలాగే జోధ్‌పూర్‌లోని మెహ్రాన్‌గఢ్ కోటతో పాటు అక్కడి జానపద సంగీతం, సంస్కృతిని మీరు ఎంజాయ్ చేయొచ్చు.

37
కేరళ
Image Credit : Other

కేరళ

వర్షాకాలం తర్వాత అక్టోబర్‌లో కేరళ పచ్చదనం మరింత పెరుగుతుంది. అలెప్పీ బ్యాక్ వాటర్స్, మున్నార్ టీ ఎస్టేట్స్, పచ్చని కొండలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. మీరు హౌస్‌బోట్‌లో ఉంటూ బ్యాక్ వాటర్స్ అందాలను ఆస్వాదించొచ్చు. అలాగే టీ ప్లాంటేషన్స్ కూడా చూడొచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడపాలనుకునే వారికి కేరళ బెస్ట్ టూరిస్ట్ స్పాట్.

47
గోవా
Image Credit : Others

గోవా

అక్టోబర్‌లో బీచ్ ట్రిప్ వెళ్లాలనుకునే వారు గోవాను ఎంచుకోవచ్చు. వర్షాకాలం తర్వాత ఇక్కడి వాతావరణం, పచ్చదనం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చలికాలంతో పోలిస్తే ఈ టైమ్‌లో పర్యాటకుల రద్దీ కాస్త తక్కువే ఉంటుంది. మీరు ప్రశాంతమైన బీచ్‌లలో సమయం గడపొచ్చు. స్కూటర్‌పై తిరుగుతూ గోవాను ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సాయంత్రం పూట సూర్యాస్తమయ అందాలను కూడా ఎంజాయ్ చేయొచ్చు.

57
కాశ్మీర్
Image Credit : ANI

కాశ్మీర్

అక్టోబర్ నెలలో కాశ్మీర్ అందాలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ సమయంలో చినార్ చెట్ల ఆకులు పసుపు, బంగారు రంగులోకి మారడం మొదలవుతుంది. చల్లని గాలి, స్వచ్ಛమైన ఆకాశం మధ్య కొండల అందాలు మనసు దోచుకుంటాయి. మీరు దాల్ సరస్సులో షికారా రైడ్ చేయొచ్చు. చుట్టుపక్కల ఉన్న లోయలను సందర్శించి, రంగులు మారుతున్న ప్రకృతిని కళ్లారా చూడొచ్చు.

67
ఆగ్రా
Image Credit : Getty

ఆగ్రా

అక్టోబర్‌లో ఆగ్రా ట్రిప్ వేయడం కూడా మంచి ఐడియా. వేసవికాలంతో పోలిస్తే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి తాజ్ మహల్‌తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలను సులభంగా చుట్టిరావచ్చు. మీరు తాజ్ మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీలను కూడా సందర్శించొచ్చు. చారిత్రక ప్రదేశాలను చూడటానికి ఇష్టపడే వారు అక్టోబర్‌లో ఆగ్రా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

77
నేషనల్ పార్క్‌లు
Image Credit : gemini ai

నేషనల్ పార్క్‌లు

వర్షాకాలం ముగిశాక అక్టోబర్‌లో చాలా నేషనల్ పార్క్‌లు పర్యాటకుల కోసం మళ్లీ తెరుచుకుంటాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్, కన్హా నేషనల్ పార్క్‌లు ఈ సమయంలో పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. రాజస్థాన్‌లోని రణథంబోర్ కూడా వన్యప్రాణి ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మీరు జంగిల్ సఫారీ చేస్తూ పులులు, జింకలతో పాటు వివిధ రకాల జంతువులు, పక్షులను చూసే అవకాశం పొందొచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ప్రయాణం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hotel: హోటల్ లో స్టే చేస్తున్నారా? రూమ్ లోకి అడుగుపెట్టగానే ఫస్ట్ చేయాల్సింది ఇదే..!
Recommended image2
Blouse Front Designs: పట్టుచీరల మీదకు బ్లౌజు ఫ్రంట్ డిజైన్లు..చూసేయండి
Recommended image3
Blouse Designs: చీరలపైకి అదిరిపోయే ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు
Related Stories
Recommended image1
Cotton Candy History: కాటన్ క్యాండీ ఎవరు కనిపెట్టారో తెలుసా? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
Recommended image2
Soil Smell: వర్షం తర్వాత వచ్చే మట్టివాసనకు ప్రత్యేకమైన పేరు ఉందని తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved