Earphone Hacks: జేబులో ఇయర్ ఫోన్ వైర్లు చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి
Earphone Hacks: జేబులో పెట్టిన ఇయర్‌ఫోన్ వైర్లు చిక్కుపడిపోవడం మనందరికీ ఎదురయ్యే కామన్ సమస్య. ఈ చిరాకును తప్పించుకోవడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే మీ ఇయర్‌ఫోన్స్ ఎప్పటికీ చిక్కుపడవు.

ఇయర్ ఫోన్ వైర్లు చిక్కులు పడ్డాయా?
ఇప్పుడు బ్లూటూత్, ఇయర్‌పాడ్స్ ట్రెండ్ నడుస్తున్నా.. చాలామంది ఇంకా వైర్ ఉన్న ఇయర్‌ఫోన్స్ వాడుతూనే ఉన్నారు. అయితే వీటిని జేబులో లేదా బ్యాగ్‌లో పెట్టి తీసినప్పుడు వైర్లు దారుణంగా చిక్కుపడిపోతాయి. ఆ ముడులను విప్పడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. మీ ఇయర్‌ఫోన్ వైర్లు అలా చిక్కుపడకుండా జేబులో ఎలా పెట్టుకోవాలో ఇక్కడ చూద్దాం.
టిప్-1
మీరు ఇయర్‌ఫోన్ వైర్‌ను రెండు వేళ్ల మధ్య పట్టుకుని '8' ఆకారంలో చుట్టండి. ఆ తర్వాత మధ్యలో ఒక చిన్న దారం లేదా సన్నటి వైర్‌తో కట్టేయండి. ఇలా చేస్తే వైర్లు అస్సలు ముడిపడవు. మీకు అవసరమైనప్పుడు చాలా ఈజీగా తీసి వాడుకోవచ్చు.
టిప్- 2
ఇయర్‌ఫోన్స్‌ను చేతికి బ్యాండ్ కట్టుకున్నట్లుగా గుండ్రంగా చుట్టండి. చివరలో ఒక రబ్బర్ బ్యాండ్ లేదా దారంతో ముడి వేయండి. మీ ఇయర్‌ఫోన్ వైర్ మరీ పొడవుగా ఉంటే, మీకు కావాల్సినంత వదిలేసి మిగతా భాగాన్ని రబ్బర్ బ్యాండ్‌తో చుట్టేయండి. ఈ ట్రిక్ వైర్లు చిక్కుపడకుండా ఆపుతుంది.
టిప్ 3
మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ లేదా దారం లేకపోతే, ఇయర్‌ఫోన్ వైర్‌ను నేరుగా మీ మొబైల్‌కే చుట్టేయండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వైర్‌ను మరీ టైట్‌గా లాగి చుట్టకండి. అలా చేస్తే వైర్ పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నెమ్మదిగా, వదులుగా చుట్టండి.
టిప్ 4
ఆఫీసుల్లో ఫైల్స్ కోసం వాడే బైండర్ క్లిప్స్‌ను మీరు ఇయర్‌ఫోన్స్ చుట్టడానికి వాడుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ దగ్గర పనిచేయని పాత ఏటీఎం కార్డులు ఉంటే, వాటిని సగానికి కట్ చేసి ఇయర్‌ఫోన్ వైర్‌ను దానికి చుట్టి భద్రపరుచుకోవచ్చు.

