MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వయసు 40 దాటిన ఆడవారు వీటిని తప్పకుండా తినాలి

వయసు 40 దాటిన ఆడవారు వీటిని తప్పకుండా తినాలి

40 ఏండ్ల దాటిన ఆడవారు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. బలమైన ఆహారాలనే తినాలి. అప్పుడే అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే లేనిపోని రోగాలొచ్చే అవకాశం ఉంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 08 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
healthy food

healthy food

వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియ మందగిస్తుది. కండరాల బలం తగ్గిపోతుంది. ముఖ్యంగా హార్మోన్లలో హెచ్చు తగ్గులు వస్తాయి. ఫలితంగా శరీర బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొవ్వుకు కరిగించే సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి, శరీర శక్తి స్థాయిలను పెంచడానికి, ఎన్నో రోగాల ప్రమాదాల్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు మీకు ఎంతో సహాయపడతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆకలి, ఆకలి కోరికలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉండదు. 40 ఏండ్లు వచ్చాక ఎక్కడలేని రోగాలన్నీ చుట్టుకుంటాయి. అందుకే ఈ వయసులో మీ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలనే తినాల్సి ఉంటుంది. ఈ 40 ఏండ్ల వయసులో ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
food

food

ఈ వయసులో  ఆరోగ్యకరంగా బరువు తగ్గుతూ.. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటూ.. లైఫ్ స్టైల్ మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాలి. ఇందుకోసం మీరు ఎన్నో పరిమితులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమతుల్య ఆహారం తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఉండే వాటినే తినాలి. పోషకాల లోపంతోనే సర్వ రోగాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పోషకాలు ఏంటంటే..  

47

ప్రోటన్ 

 మన శరీరానికి ప్రోటీన్లు అవసరం కాదు అత్యవసరం. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఎందుకంటే ఇవి ఫైబర్ మాదిరిగానే.. మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. తొందరగా ఆకలి కానీయవు. ఇందుకోసం గుడ్లు, మాంసం, పౌల్ట్రీ, పాడి, బీన్స్, చిక్కుళ్లు వంటివి తినండి. వీటిని మీరోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

57

విటమిన్లు, ఖనిజాలు

విటమిన్లు, ఖనిజాలు లేకుండా మీ శరీరం సరిగ్గా పనిచేయదు. అందుకే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, బీన్స్, గుడ్లు, తృణధాన్యాలు, చేపలు, షెల్ఫిష్ వంటి ఆహారాలను తినండి. వీటిద్వారా మీ  శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి. 
 

67
healthy fats

healthy fats

ఆరోగ్యకరమైన కొవ్వులు

మన శరీరం సరిగ్గా పనిచేయడానికి పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు చాలా చాలా అవసరం. ఇవి గుండె జబ్బులు, డయాబెటీస్, ఊబకాయంతో సహా ఎన్నో రోగాల ప్రమాదాల్ని తగ్గిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఆలివ్ ఆయిల్, కొవ్వు చేపలు, అవకాడోలు, ఆలివ్, గింజలు, గింజల నూనెలో పుష్కలంగా ఉంటాయి. శరీరం ద్వారా విటమిన్ల శోషణను నిర్ధారించడానికి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం చాలా ముఖ్యం. 
 

77
fiber

fiber

ఫైబర్

ఫైబర్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి. మొత్తంగా ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లుు, బీన్స్, తృణధాన్యాలు, ఇతర ఆహారాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Travel Tips: కారు, బస్సు ప్రయాణం పడడం లేదా? వాంతులు అవుతుంటే ఈ చిన్న పని చేయండి
Recommended image2
Mangalsutra Bracelet: నేటి మగువల మనసు దోచే మంగళసూత్ర బ్రేస్‌లెట్స్
Recommended image3
Butterfly Rings: ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ బటర్ ఫ్లై రింగ్స్ ట్రై చేయాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved