చలికాలంలో చిలగడదుంపలను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
చలికాలంలో చిలగడదుంపలను ఖచ్చితంగా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి మన శరీరానికి చలిని తట్టుకునే శక్తినిస్తాయి. అలాగే..
చిలగడదుంలపను తినని వారు అస్సలు ఉండరేమో.. తియ్యగా రుచిగా ఉండే చిలగడదుంపల్లో పోషకవిలువలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చిలగడదుంపల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకు చిలగడదుంపలు ఎంతో సహాయపడతాయి. అసలు చలికాలంలో చిలగడదుంపలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మానికి మంచిది
చలికాలంలో మన చర్మం తేమను కోల్పోతుంది. చిలగడదుంపలు మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి చర్మ వృద్ధాప్యానికి కారణమయ్యే ప్రీరాడికల్స్ తో పోరాడటానికి చర్మానికి సహాయపడతాయి. ఇవి చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. అలాగే మచ్చలను పోగొడుతాయి. దీన్ని తినడం వల్ల మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చర్మ సమస్యలు తొలగిపోతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
చిలగడదుంపల్లో విటమిన్ సి, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అలాగే అంటువ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చిలగడదుంపలకు ఊదా రంగును ఇచ్చే ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరం ద్వారా సమర్థవంతంగా ఉపయోగించబడతాయి. మొత్తంగా ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి
ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అయితే చిలగడదుంపలు వీటిని తగ్గించేందుకు సహాయపడతాయి. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
వెచ్చగా ఉంచుతుంది
రూట్ కూరగాయలు సాధారణంగా వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలో చిలగడదుంపలు ఒకటి. చిలగడదుంపల్లో సహజ చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. చలికాలంలో వెచ్చగా ఉండాలనుకుంటే బంగాళాదుంపలను ఖచ్చితంగా తినండి.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
చిలగడదుంపల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించాలనుకుంటే చిలగడదుంపలను ఖచ్చితంగా తినండి. ఎందుకంటే దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. బంగాళాదుంపలు రాగికి మంచి వనరులు. ఇది ఎర్ర రక్తకణాలను తయారుచేయడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
శీతాకాలం, వేసవికాలం, వసంతకాలం అంటూ కాలాలతో సంబంధం లేకుండా చిలగడదుంపలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చిలగడదుంపల్లో ఉండే బీటా కెరోటిన్ రొమ్ము, అండాశయ క్యాన్సర్ ప్రమాదాల్ని తగ్గిస్తుంది. చిలగడదుంపల్లో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది స్త్రీలలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.