MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చలికాలంలో ఆలు బుకరా పండ్లను తప్పకుండా తినండి.. ఎందుకంటే?

చలికాలంలో ఆలు బుకరా పండ్లను తప్పకుండా తినండి.. ఎందుకంటే?

ఆలు బుకరా పండ్లు ఎరుపు, నీలం రంగులో ఉంటాయి. ఈ పండ్లు పోషకాలకు మంచి వనరులు. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండ్ల ప్రయోజనాలను తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు తెలుసా?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 24 2022, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చలికాలంలో దగ్గు, జబులు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, డ్రై స్కిన్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందుకు ఒక కారణం ఈ సీజన్ లో మన ఇమ్యూనిటీ పవర్ తగ్గడం. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ చలికాలంలో పుష్కలంగా లభించే పండ్లలో ఆలు బుకరా పండ్లు ఒకటి. ఈ సీజన్ లో ఈ పండ్లు ను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఆలు బుకరా పండ్లతో కేకులు, ఊరగాయలు, జామ్ లు, ఇతర స్వీట్లను తయారుచేస్తారు. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను, రక్తప్రసరణను పెంచడానికి సహాయపడతాయి. ఈ శీతాకాలంలో ఆలు బుకరా పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఆలు బుకరా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీ  ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అలాగే గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాల్ని తగ్గిస్తాయి. 
 

38
cholesterol

cholesterol

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

ఈ పండ్లలో కరిగే ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కాలెయం కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది. పిత్తం కొలెస్ట్రాల్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలాగే కరిగే ఫైబర్ ద్వారా శోషించుకోబడుతుంది. 

48

ఎముకలకు మంచిది

ఆలు బుకరాలో బోరాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముక సాంద్రతను రక్షిస్తుంది. ఈ పండులో ఉండే ఫ్లేవనాయిడ్, ఫినోలిక్ రసాయనాలు ఎముక నష్టాన్ని ఆపుతాయి. 
 

58

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

ఆలు బుకరా పండ్లు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇది జలుబు, ఫ్లూ రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ గుజ్జు పండు బలమైన కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. 
 

68
hair care

hair care

జుట్టు రాలడాన్ని ఆపుతాయి

ఆలు బుకరా పండ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ పండ్లను తింటే జుట్టు రాలడం ఆగుతుంది. దీనిలో ఉండే ఐరన్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో మీ జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. 
 

78

చర్మానికి మంచిది

ఆలు బుకరా పండ్లను తినడడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ చర్మం సాగకుండా బిగుతుగా ఉంచుతుంది. తొందరగా ముడతలు వచ్చే అవకాశం ఉండదు. ఈ పండ్లు మీరు యవ్వనంగా కనిపించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ పండ్లు ముడతలను తగ్గిస్తాయి. చర్మం యవ్వనంగా ఉండేందుకు ఈ పండ్ల జ్యూస్ ను ఎక్కువగా తాగుతుంటారు. 
 

88

మలబద్దకం నుంచి ఉపశనం కలుగుతుంది

ఆలు బుకరాలో సోర్బిటాల్, ఇసాటిన్ లు ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఎండిన ఆలు బుకరాను తింటే మీ గట్ ఆరోగ్యం బాగుంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Henna: తెల్ల జుట్టు కవర్ చేయాలని హెన్నా పెడుతున్నారా? ఇలా చేస్తే మీకే నష్టం
Recommended image2
Mixer Grinder: మిక్సీ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే పేలిపోతాయి జాగ్రత్త
Recommended image3
BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved