Health Tips: పుచ్చకాయ తొక్క మన ఆరోగ్యానికి ఇంత మంచి చేస్తుందా..?
Health Tips: వేసవిలో పుష్కలంగా లభించే పుచ్చకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయే కాదు పుచ్చకాయ తొక్క రసం కూడా మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

వేసవిలో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా మండుతున్న ఎండలకు శరీరంలో వేడి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అయితే పుచ్చకాయను తింటే శరీరం చల్లబడుతుంది. దీనిలో 90 శాతం నీరుంటుంది. ఇది బాడీ డీహైడ్రేట్ బారిన పడకుండా కాపాడుతుంది.
మీకు తెలుసా పుచ్చకాయ గుజ్జే కాదు.. పుచ్చకాయ తొక్క కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ తొక్కలో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. మరి పుచ్చకాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి..
పుచ్చకాయ రసాన్ని తయారుచేసే విధానం:
కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ తొక్క తెల్లని భాగం ఒక కప్పు, నల్ల ఉప్పు (Black salt), మందాల పూల నీళ్లు (Herd flower water), తేనె (Honey)ను తీసుకోవాలి.
తయారీ విధానం: మందార పువ్వులను బాగా ఎండబెట్టండి. ఆ తర్వాత పుచ్చకాయ తెల్లని భాగాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయండి. ఇందులో ఎండబెట్టిన మందార పువ్వులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్ లో తీసుకుని అందులో ఉప్పు, తేనెను కలపండి. దీన్ని క్రమం తప్పకుండా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది.
పుచ్చకాయ రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
నిద్రకు మంచిది: పుచ్చకాయ తొక్క మంచి నిద్రకు సహాయపడుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం.. తొందరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు తరచుగా తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
బరువును నియంత్రిస్తుంది: ఈ రోజుల్లో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే వీరికి పుచ్చకాయ రసం దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో జీవక్రియను పెంచే గుణాలు ఉన్నాయి. ఇది ఓవర్ వెయిట్ ను తగ్గిస్తుంది.
చర్మం మరియు జుట్టుకు మేలు చేస్తుంది: పుచ్చకాయ తొక్కల నుంచి తయారుచేసిన రసం బరువు తగ్గడానికే కాదు జుట్టు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు, చర్మ సంరక్షణకు తోడ్పడుతాయి.
బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది: వేసవిలో పుచ్చకాయను తినడం వల్ల మన శరీరం చల్లగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే దీని తొక్క కూడా మన శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. అంతేకాదు వడదెబ్బ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.