MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chanakya Niti: పిల్లల ముందు పేరెంట్స్ అస్సలు చేయకూడని 4 పనులు ఇవే..!

Chanakya Niti: పిల్లల ముందు పేరెంట్స్ అస్సలు చేయకూడని 4 పనులు ఇవే..!

Chanakya Niti: ఆచార్య చాణక్యుని ప్రకారం, పిల్లల వ్యక్తిత్వాన్నీ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పేరెంట్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, పిల్లల ముందు పేరెంట్స్ కొన్ని పనులు అస్సలు చేయకూడదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 01 2026, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పేరెంట్స్ కి చాణక్యుడు ఇచ్చే సలహా...
Image Credit : AI

పేరెంట్స్ కి చాణక్యుడు ఇచ్చే సలహా...

పిల్లలు తమ పేరెంట్స్ ని చూసే పెరుగుతూ ఉంటారు. వాళ్ల ప్రవర్తను గమనిస్తూనే ఉంటారు. అవే నేర్చుకుంటూ ఉంటారు. స్కూల్ కి వెళ్లి, పుస్తకాలు చదివి కంటే కూడా ఇంట్లోనే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే విషయాన్ని పిల్లలు ఎక్కువగా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు మంచి మాత్రమే ఇంట్లో నేర్చుకోవాలి అంటే.. వారి ముందు పేరెంట్స్ కొన్ని పనులు చేయకూడదు. ఆ పనులు ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1. పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధం చెప్పకండి:
Image Credit : chatgpt

1. పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధం చెప్పకండి:

తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. ఒకసారి పెద్దలు అబద్ధం చెబితే, పిల్లలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఇది వారి లేత మనసులపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. రాబోయే కాలంలో విషయాలను దాచడం, పదేపదే అబద్ధాలు ఆడటం వారు అలవాటుగా మార్చుకుంటారు. కాబట్టి, జీవితంలో ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదని, సరదాకోసం కూడా నిజం దాచవద్దని వారికి నేర్పించాలి. అలా పిల్లలు నేర్చుకోవాలి అంటే.. పిల్లలు కూడా పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు.

2. ఒకరినొకరు గౌరవించుకోవడం: 

కొన్నిసార్లు తల్లిదండ్రులు తమలో తాము మాట్లాడుకునేటప్పుడు కోపంతో బిగ్గరగా మాట్లాడటం లేదా ఇతరుల ముందు ఒకరిని ఒకరు కించపరుచుకోవడం చేస్తుంటారు. ఒకరి తప్పులను, లోపాలను ఎత్తిచూపుతూ మాట్లాడుకోవడం వల్ల ఆ ప్రభావం పిల్లల మనస్తత్వంపై పడుతుంది. పెద్దల ప్రవర్తనను చూసే పిల్లలు కూడా ఇతరులను గౌరవించడం మానేసి, తప్పుడు భాషలో మాట్లాడటం నేర్చుకునే ప్రమాదం ఉంది.

33
3. అతి గారాబం ప్రమాదకరం:
Image Credit : AI

3. అతి గారాబం ప్రమాదకరం:

పిల్లలంటే ప్రేమ ఉండటంలో తప్పు లేదు కానీ, వారిని అవసరానికి మించి గారాబం చేయడం అనేక చెడు అలవాట్లకు దారితీస్తుంది. పిల్లలను అతిగా పొగుడుతూ, వారి తప్పులను వెనకేసుకొస్తే వారు చెడిపోయే అవకాశం ఉంది. పిల్లల్లో మంచి నైతిక విలువలు పెంపొందాలంటే ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం.

4. తప్పు చేస్తే వదిలేయకూడదు..

అతి ప్రేమ కారణంగా పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను కూడా తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ఇది భవిష్యత్తులో వారు పెద్ద తప్పులు చేయడానికి దారితీస్తుంది. సాధారణంగా ఐదేళ్ల వయస్సు వరకు పిల్లలను గారాబంగా పెంచవచ్చు, కానీ ఆ తర్వాత వారి తప్పులను సరిదిద్దాలి. మంచి చెడుల మధ్య తేడాను వివరించాలి. ముఖ్యంగా పిల్లలు టీనేజ్ లో అడుగుపెట్టినప్పుడు వారితో స్నేహపూర్వకంగా మెలుగాలి. అప్పుడే వారు తమ విషయాలను మీతో పంచుకుంటారు, ఎలాంటి తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా వారిని సరైన దారిలో నడుస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
చిన్నారుల సంరక్షణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Better Sleep: రాత్రి మంచి నిద్ర పట్టాలంటే ఇదొక్కటి తినండి..ఉదయానికి ఫ్రెష్ గా ఉంటారు
Recommended image2
Fish: ఈ చేప తన పిల్లలు నోట్లోనే దాచి మరీ పెంచుకుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image3
Earrings: హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
Related Stories
Recommended image1
Fish: ఈ చేప తన పిల్లలు నోట్లోనే దాచి మరీ పెంచుకుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
Instant Dosa: పప్పు నానపెట్టకుండా, పిండి రుబ్బకుండా.. 20 నిమిషాల్లో దోశ చేసేయండి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved