Banana Side effects: వామ్మో.. అరటి పండు తినడం వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయా..
Banana Side effects: అరటిపండులో పోషకవిలువలు మెండుగా ఉంటాయి. అందుకే ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. తక్షణ శక్తిని అందించడంలో ఈ పండే ముందుంటుంది. అందుకే కదా జిమ్ లల్లో కసరత్తులు చేసే వారు అరటి పండ్లనే ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చాలా మందికి అరటి తినడం వల్ల కలిగే లాభాలే తెలుసు గానీ.. నష్టాలేంటో తెలియదు. దీని వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయని మీకు ఎరుకేనా..
Banana Side effects: రోజుకో అరటిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, మెగ్నీషీయం, బయోటిన్, మాంగనీస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అంతేకాదు ఈ అరటిలో ఉంటే పోషకాల వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఆస్థమా వంటి సమస్యలను కూడా నిరోధిస్తుంది. ఇంతే కాదు అరటిపండును తినడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు జరుగుతాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అరటిపండును తినడం వల్ల ఉపయోగాలే కాదు.. నష్టాలు కూడా జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు అరటిపండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అరటిపండ్లలో టైరమైన్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల మైగ్రేన్ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు అరటి పండుకు దూరంగా ఉండటం చాలా మంచిది.
అధిక బరువుతో బాధపడేవారు ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. అలాంటి వారు అరటిపండుకుు దూరంగా ఉండాలి. ఎందుకంటే అరటిపండు ద్వారా అధిక కేలరీలను పొందుతారు. అది మీ బరువును అమాంతం పెంచేయడంలో సహాయపడుతుంది. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు అరటిపండ్లను తినకూడదు.
మీకు అలర్జీ సమస్య ఉంటే అరటిపండును తినకపోవడమే ఉత్తమమైనది. ఎందుకంటే మీరు ఎటువంటి అలర్జీ సమస్యతో బాధపడినా.. అరటి పండును తింటే అది మరింత పెరిగే అవకాశముంది. అందుకే ఇలాంటి వారు అరటిని తినకపోవడమే బెటర్.
అరటిపండును తినడం వల్ల మలబద్దకం బారిన పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ పండులో టానైట్ అనే యాసిడ్ మూలంగా జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. దాంతో మీరు మలబద్దకం సమస్యను ఎదుర్కోవచ్చు. కాబట్టి మలబద్దకం సమస్యతో బాధపడేవారు అరటిపండుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ పండులో ఉండే ఫ్రక్టోజ్ కారణంగా కడుపులో గ్యాస్ సమస్య కూడా పెరుగుతుంది.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు అరటిపండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల హైపర్ కలేమియా వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుండె సంబంధిత సమస్యలున్న వారు అరటిని తినకపోవడమే మంచిది. అలాగే అరటి దంతాల సమస్యలను కూడా తెస్తుంది.