ఈద్ విందు తర్వాత కడుపులో సమస్యలు రాకూడదంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..!
బక్రీద్ పండుగ స్పెషల్స్ గా మటన్ బిర్యాని, పొట్టేలు కూర, మేక కూర, ఫ్రై అంటూ రకరకాల వంటలు నోరూరిస్తాయి. కానీ వీటన్నంటినీ తినడం వల్ల పొట్ట ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ విందుతో అజీర్థి సమస్యలు కూడా వస్తాయి.

Image: Getty Images
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ పండుగ పర్వదినాన ముస్లింలు ఈద్ విందును ఒక రోజుకే పరిమితం చేయకుండా మూడు నాలుగు రోజులు ఏర్పాటుచేస్తారు. ఈ విందుతో ఒక్క సారిగా హెవీ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా జీర్ణసమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కడుపు శుభ్రం అవడమే కాదు.. జీర్ణ సమస్యలు కూడా తలెత్తవు.
బొప్పాయి (papaya)
ఈద్ విందు చేసిన తర్వాత కొద్దిగా బొప్పాయి పండును తింటే మీ కడుపు శుభ్రంగా ఉంటుంది. ఇందుకోసం రాత్రి భోజనం చేసిన తర్వాత, ఉదయం లేచిన తర్వాత బొప్పాయిని తినండి. బొప్పాయిని తినడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఎసిడిటీ, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
మజ్జిగ (buttermilk)
మజ్జిగ కూడా జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఇందుకోసం.. మజ్జిగలో కాస్త నల్ల ఉప్పు, అజ్వైన్, జీలకర్ర వేసి బాగా కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈద్ విందుకు ముందు గ్లాస్ మజ్జిగను తాగండి.
గోరు వెచ్చని నీళ్లు
ఈద్ విందులో హెవీగా తిన్న వారు గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగితే మంచిది. గోరువెచ్చని నీళ్లు కడుపును శుభ్రంగా చేస్తాయి. అలాగే కడుపుని క్లియర్ చేస్తాయి. ఇందుకోసం ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లను తాగాలి. దీనివల్ల కడుపులో ఉండే విషపదార్థాలు కూడా బయటకు పోతాయి.
పుదీనా టీ (Mint tea)
కడుపు నొప్పి, అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలను పోగొట్టడానికి పుదీనా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నీటిలో మరిగించి వడకట్టి ఉదయం పూట తాగండి. ఇది పొట్టను క్లీన్ చేస్తుంది.
నిమ్మకాయలు (Lemons)
అజీర్థి, కడుపునొప్పిని తగ్గించడంలో నిమ్మకాయ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగ్గా పనిచేసేలా ఉంచుతాయి. ఉదయం పూట నిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.
నడవండి
తిన్న తర్వాత పడుకోవడమో.. కూర్చోవడమో చేయకుండా.. కాసేపు నడవండి. నడిస్తే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. సోమరితనం కూడా పోతుంది. కేలరీలు కూడా బర్న్ అవుతాయి. అజీర్థి, కడుపు సమస్యలు కూడా తొలగిపోతాయి.