వెన్ను నొప్పి కూడా కరోనా లక్షణమేనా..?
Back pain: కరోనా బారిన పడితే జలుబు, జ్వరం, గొంతు నొప్పి, అలసట వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. అందులో వెన్ను నొప్పి కూడా ఒకటుందన్న సంగతి మీకు తెలుసా..

covid
కోవిడ్ -19 ఇంకా వదిలిపోలేదు. ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారితో నేటికీ పోరాడుతూనే ఉన్నాయి. ఇది రోజు రోజుకు కొత్త వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే ఎక్కువగా ఉన్నాయి.
వైరస్ జన్యుపరంగా ఈ వేరియంట్లు మార్పు చెందినప్పుడు వ్యాధి స్వభావంలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. అలాగే వీటి లక్షణాల్లో కూడా మార్పులు వస్తున్నాయి.
కరోనాతో బాధపడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి వెన్ను నొప్పి
సాధారణం గా వెన్ను నొప్పి కోవిడ్ -19 లక్షణం కాదు. కానీ యూకెకు చెందిన Zoe COVID Symptom Study ప్రకారం.. కరోనా టాప్ 20 లక్షణాలో వెన్ను నొప్పి ఒకటిగా ఉంది. కాగా యూకెలో ప్రతి రోజూ లక్షల మంది దీని బారిన పడుతున్నారు. తమ లక్షణాలను కూడా తెలియజేశారు. ఈ స్టడీ ప్రకారం.. వెన్న నొప్పి కూడా కోవిడ్ -19 లక్షణమే. ఓమిక్రాన్ తో బాధపడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి వెన్ను నొప్పి ఉందని ఈ స్టడీ తెలియజేస్తుంది. కాగా ఈ వెన్ను నొప్పిని మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కలిగే, పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పితో పోల్చారు.
అయితే కోవిడ్ రోగులకు వెన్ను నొప్పి ఎందుకు కలుగుతుందన్న విషయంపై పరిశోధకులు ఇంకా స్పష్టమైన వివిరణ ఇవ్వలేదు. కాగా ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందని కరోనా బాధితులు తెలియజేసారట.
అయితే వెన్ను నొప్పి ఉన్నంత మాత్రాన మీకు కరోనా సోకిందని కూడా అర్థం చేసుకోకూడదు. కరోనా ఇతర లక్షణాలు కనిపిస్తేనే మీరు కరోనా బారిన పడ్డారని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే వెన్ను నొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది.
కరోనా లక్షణాలు
కరోనా సోకితే.. తుమ్ములు, దగ్గు, జ్వరం, జలుబు, విపరీతమైన అలసట, కండరాల నొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు సాధాణంగా కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటేనే ఈ లక్షణాలు కనిస్తాయి. అదే వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ అందకపోవడం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.