Ayurvedic Wisdom: పొద్దున్నే బ్రష్ చేయకూడదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది!
Ayurvedic Wisdom: ఎవరైనా పొద్దున్న లేవగానే చేసే పనేంటి? బ్రష్ చేస్తారు కదా.. కాని ఆయుర్వేదం ఏం చెబుతోందంటే.. పొద్దున్నే లేవగానే ఫస్ట్ బ్రష్ చేయకూడదంట. ఎందుకు పళ్లు తోముకోకూడదు. దీనికి వెనుక దాగి ఉన్న ఆయుర్వేద రహస్యం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పొద్దున్నే లేవగానే పేస్ట్, బ్రష్ వెతకడం మనలో చాలా మందికి అలవాటు. పళ్ళు తోముకుంటేనే అది పొద్దున్న అవుతుంది కదా.. కాని మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయకూడదు. పళ్లు తోముకోకుండా మరేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదం ఏం చెబుతుంది?
ఆయుర్వేదం మనిషి నేచర్ తో కలిసి జీవించడాన్ని వివరిస్తుంది. అంటే ప్రకృతి మనకు ఇచ్చిన సంపద ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఏ వస్తువును ఎలా వాడితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇలాంటి విలువైన సమచారాన్ని ఆయుర్వేదం అందిస్తుంది. ఈ పురాతన వైద్యశాస్త్ర ప్రకారం నిద్ర లేచిన వెంటనే డైలీ లైఫ్ ని ఎలా ప్రారంభించాలి? ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.
జీర్ణక్రియకు సంబంధం
ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ముందు పళ్ళు తోమకూడదంట. పొద్దున్నే లేచి ముందు ఒక గ్లాస్ మంచి నీరు తాగాలి. మీకు వీలైన గోరు వెచ్చని నీరు తాగితే మరింత మంచిది. పళ్లు తోముకోకుండా మంచి నీళ్లు తాగడం కష్టంగా అనిపించినా ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరతాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఇది కూడా చదవండి వేసవిలో ఒకేసారి లీటరు నీరు తాగితే అంతే.. కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే..
గ్యాస్, ఎసిడిటీ మాయం
బ్రష్ చేయకుండా మంచి నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ స్ట్రాంగ్ గా మారుతుంది. అంటే రాత్రి భోజనం చేసి లేదా టిఫెన్ తిని నిద్రపోతాం కదా.. వాటిని అరింగిచేందుకు రిలీజ్ అయిన యాసిడ్స్ కడుపులోనే ఉండిపోతాయి. అవి బాగా ఘాడతతో ఉంటాయి. అందువల్ల గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఆ యాసిడ్స్ ని డైల్యూట్ చేయడానికి పొద్దున్న లేచిన వెంటనే ఒక గ్లాస్ మంచి నీరు తాగితే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.
మంచి బ్యాక్టీరియా పోతుంది..
ఇంకో ఉపయోగం ఏంటంటే.. రాత్రంతా నోటిని ఉపయోగించకుండా ఉన్నందుకు అందులో బ్యాక్టీరియా చేరుతుంది. ఇది మంచి బ్యాక్టీరియా. నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేస్తే ఆ బ్యాక్టీరియా బయటకు పోతుంది. అదే ఒక గ్లాస్ వాటర్ తాగితే కడుపులోకి ఆ బ్యాక్టీరియా వెళ్లి జీర్ణ వ్యవస్థను మొత్తం శుభ్రం చేస్తుంది. తర్వాత బాత్రూం కూడా ఈజీగా వస్తుంది. దీంతో కడుపులో ఉండే చెడు అంతా బయటకు పోతుంది. అందుకే పళ్లు తోముకోకుండా మంచి నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఉన్నవి కూడా తగ్గుతాయి.