దీపావళికి ఈ స్వీట్లను ఎక్కువగా తినకండి.. ఒకవేళ తిన్నారో మీ పని అంతే..
ఊబకాయలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు, బరువు తగ్గాలనుకునే వారు దీపావళికి కొన్ని రకాల స్వీట్లను ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఏం కాదని తింటే.. మీ పని అంతే..

మనం జరుపుకునే పెద్ద పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. ఇక ఈ పండుగకు ఎక్కడెక్కడో పనిచేసేవారు, చదువుకునే వారంతా సొంతూళ్లకు వస్తుంటారు. పండుగకు ఇంటి కొచ్చే బంధువుల కోసం రకరకాల స్వీట్లను, వంటలను తయారుచేస్తుంటారు. కానీ కొన్ని రకాల స్వీట్లు, ఆహారాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే పదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. శరీర బరువును కూడా పెంచుతాయి. ముఖ్యంగా ఊబకాయలు కొన్నింటికి దూరంగా ఉండటమే మంచిది. అవేంటో తెలుసుకుందాం పదండి..
కజ్జికాయ
కజ్జికాయల పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి కదా.. చాలా మటుకు ప్రతి పండుగకు వీటిని ఖచ్చితంగా తయారుచేసుకుని తింటుంటారు. ముఖ్యంగా దీపావళికి అయితే పక్కాగా చేస్తారు. మైదా, కొబ్బరి తురుము, చక్కెరతో వీటిని చేస్తారు. టేస్టీగా ఉన్నా వీటిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. మోతాదుకు మించి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చక్కెర వల్ల బరువు కూడా పెరుగుతారు.
పాపడ్
పాపడ్ లేదా అప్పడాలను రోజూ భోజనంలో తినేవారు చాలా మందే ఉన్నారు. అయితే చాలా ఏండ్ల నుంచి వీటిని దీపావళి సందర్భంగా కూడా తింటున్నారు. అయితే వీటిని శెనగపిండి, నూనె సాయంతో తయారుచేస్తారు. అయితే వీటిని మార్కెట్ లో కొనడం మంచిది కాదు. ఎందుకంటే వీళ్లు ఒకసారి ఉపయోగించిన నూనెను అది అయిపోయేదాక అలాగే ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ పెరగడం వరకు ఎన్నో రోగాలొచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిని మార్కెట్ లో కొనకండి. అయినా వీటిని మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇది బరువును పెంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా పెంచుతాయి.
జిలేబీ
జిలేబీ పేరు చెప్పగానే.. నోట్లో నీళ్లు ఊరుతాయి. అసలు దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో కదా.. ఇక దీపావళి సందర్భంగా వీటిని ఇష్టమున్నన్ని లాగించే వారు చాలా మందే ఉంటారు. అందులోనూ ఈ దీపావళి సందర్భంగా వీటికి డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ జిలేబీలో షుగర్ కంటెంట్ మోతాదుకు మించి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను దారుణంగా పెంచుతుంది.
కచోరి
దీపావళి సందర్భంగా చాలా మంది కచోరీలను తయారుచేస్తుంటారు. నిజానికి కచోరీలు బలే టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిని ఎక్కువగా అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిలో నూనె ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
లడ్డూలు
దీపావళికి ఏ స్వీట్లు ఉన్నా.. లేకున్నా.. తియ్య తియ్యని లడ్డూలు మాత్రం పక్కాగా ఉంటాయి. చాలా మందికి స్వీట్లంటేనే ఇష్టం ఉంటుంది. కానీ ఈ లడ్డూలను మరీ ఎక్కువగా తింటే కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.