ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు..?
నిద్రే సర్వ రోగ నివారిణి. నిద్ర లేకపోతే.. సర్వ రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. 8 గంటల నిద్రపోతే చాలని చాలా మంది అంటుంటారు. వాస్తవానికి వివిధ వయసుల వారికి నిద్రగంటల్లో మార్పు ఉంటుంది. ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకుందాం పదండి.

ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఎన్నో వ్యాధులు చుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే కంటి నిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. మనకు నిద్ర సరిపోతే.. రిఫ్రెష్ గా భావిస్తాం. ఆరోగ్య నిపుణులు మనం ఖచ్చితంగా 8 గంటల నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరికీ వర్తించదు. ప్రతి వయస్సుకు వేర్వేరు స్థాయి నిద్ర ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటే మీ వయసుకు తగ్గ నిద్రను ఖచ్చితంగా పోవాలి. మరి ఏ వయసు వారు ఎంత సేపు పడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
sleep
6 నుంచి 13 సంవత్సరాల పిల్లలు ఎలా నిద్రపోతారో మీకు తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలు ఎంత ఎక్కువ నిద్రపోతే.. వారి మనస్సు అంత వేగంగా ఉంటుంది. అందుకే 6 నుండి 13 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు రోజుకు కనీసం 11 గంటల నిద్ర పోవాలని నిపుణులు చెబుతున్నారు. 11 గంటల నిద్రపోయే పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు.
14 నుంచి 17 సంవత్సరాల వయస్సు వరకు.. మీ బిడ్డ 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్టైతే.. అప్పుడు పిల్లలకు కంటి నిండా నిద్ర అవసరమని గుర్తించుకోవాలి. ఈ వయస్సు ఉన్న పిల్లలకు 24 గంటల్లో కనీసం 8 నుంచి 10 గంటల నిద్ర చాలా అవసరం.
18 నుంచి 25 సంవత్సరాలు: 18 సంవత్సరాలు నిండిన పిల్లలు వాళ్ల ఫ్యూచర్ గురించి ఎన్నోప్లాన్స్ వేసుకుంటారు. వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లల దృష్టంతా చదువులపైనే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వారికి కంటినిండా నిద్రలేకపోతే.. ఎన్నో రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వయస్సు పిల్లలు కనీసం 7 నుంచి 9 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి.
sleep
25 నుంచి 65 సంవత్సరాలు: 25 ఏళ్లు దాటిన వారికి బరువు బాధ్యతలు పెరుగుతాయి. వీటన్నింటి మధ్య మీ శరీరాన్నిఆరోగ్యంగా ఉంచడానికి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
65 ఏళ్లు పైబడిన వారికి: మీ వయసు 65 సంవత్సరాలకు చేరుకున్నట్లయితే.. మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వయస్సులో ఎన్నో రకాల వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ వయస్సు వారు ఖచ్చితంగా 8 నుంచి 10 గంటల నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.