MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pigeons: ఇంట్లో పావురాలను పెంచుతున్నారా? ప్రాణాల మీదకొస్తుంది జాగ్రత్త

Pigeons: ఇంట్లో పావురాలను పెంచుతున్నారా? ప్రాణాల మీదకొస్తుంది జాగ్రత్త

Pigeons: పావురాలను ఇష్టంగా పెంచే వారు ఎంతో మంది. అవి కూడ మనుషులతో కలిసి జీవించే పక్షులు. మన ఇళ్లలో, ఆఫీసు భవనాలపై గుంపులుగా కనిపిస్తుంటాయి. అయితే పావురాలను పెంచడం వల్ల లేదా బాల్కనీలో వాటిని ఉంచడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 09 2026, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పావురాలతో చాలా ప్రమాదం
Image Credit : Getty

పావురాలతో చాలా ప్రమాదం

మనుషులతో కలిసి ఉండేందుకు ఇష్టపడే పక్షలు పావురాలు. అందుకే అవి మన ఇంటి చుట్టూ లేదా ఆఫీసుల భవనాలపై, బాల్కనీలలో కనిపిస్తుంటాయి. కొంతమంది వాటిని పెంచడం వంటివి చేస్తుంటారు.  పావురాల సమీపంలో ఉండడం చాలా ప్రమాదకరమని చెబుతారు. వాటి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులతో సహా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పావురం వేసే రెట్టలు.. ఊపిరితిత్తుల అలర్జీలు, హైపర్‌సెన్సిటివిటీ న్యూమోనిటిస్, హిస్టోప్లాస్మోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సాల్మొనెల్లా/ఇ-కోలి వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. దగ్గు, శ్వాస ఆడకపోవడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెట్టలు ఎండిపోయి పొడిగా మారి గాలిలో కలిసి పోతాయి. ఆ గాలిని పీల్చడం వల్ల అవి ఊపిరితిత్తుల్లోకి చేరి  తీవ్రమైన పల్మనరీ ఫైబ్రోసిస్‌కు కారణమవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే ఛాన్స్
Image Credit : Getty

ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే ఛాన్స్

పావురం వేసే వ్యర్థాల వల్ల హైపర్‌సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది. ఎక్కువకాలం పరిస్థితి ఇలాగే ఉంటే అది పల్మనరీ ఫైబ్రోసిస్‌కు దారితీయవచ్చు. సాల్మొనెల్లా, ఇ-కోలి బ్యాక్టీరియాల వల్ల కడుపులో సమస్యలు రావచ్చు. అంతేకాకుండా, పావురాలపై ఉండే పురుగుల వల్ల కూడా అలర్జీలు వచ్చే ప్రమాదం ఎక్కువ.

33
పావురాలకు దూరంగా ఉండండి
Image Credit : Getty

పావురాలకు దూరంగా ఉండండి

పావురాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  పావురాల రెట్టలతో ఎక్కువగా సంబంధం ఉన్నవారికి అలర్జిక్ న్యూమోనైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. దీనితో పాటు హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. పావురాల సంఖ్య అధికంగా పెరిగిన నగరాల్లో శ్వాసకోశ వ్యాధులు కూడా పెరుగుతున్నాయని యశోద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రెస్పిరేటరీ మెడిసిన్ & ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అంకిత్ భాటియా అంటున్నారు.

పావురాలతో ఎక్కువగా ఉండేవారికి హైపర్‌సెన్సిటివిటీ న్యూమోనైటిస్ వస్తుంది. పావురాలను పెంచేవారు, అవి ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. రెట్టలను తుడిచేటప్పుడు  N95 మాస్క్ ధరించాలి. ఎండిన రెట్టలను నేరుగా తుడవకుండా, నీళ్లు చల్లి తడిపిన తర్వాతే శుభ్రం చేయాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ginger Garlic Paste: ఇదొక్కటి కలిపితే... అల్లం వెల్లుల్లి పేస్టు 6 నెలలైనా ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image2
Paya: చిక్కటి మటన్ పాయా ఇలా వండారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు.. ఇడ్లీ, దోశెతో అదిరిపోతుంది
Recommended image3
Pearl Choker:మెడ నిండుగా ముత్యాల చోకర్...చూడటానికి రెండు కళ్లు సరిపోవు
Related Stories
Recommended image1
Mercury Retrograde: బుధ గ్రహం తిరోగమనంతో ఈ 4 రాశుల వారి జీవితంలో కీలక మలుపు, ఉద్యోగం వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం
Recommended image2
Lower Berth: రైల్లో లోయర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved