Gongura Chicken Recipe: ఆంధ్రా స్టైల్లో గొంగూర చికెన్.. లొట్టలేసుకుంటూ తినేస్తారంతే!
Gongura Chicken Recipe: గొంగూర చికెన్ పేరు వినగానే నోట్లో నీళ్లూరడం ఖాయం. పుల్లపుల్లని గొంగూర, మెత్తని చికెన్, ఘాటైన మసాలాలు కలిస్తే ఆ రుచే వేరు. వేడివేడి అన్నంలో ఈ ఆంధ్రా స్టైల్ గొంగూర చికెన్ కలిపి తింటే ఆ మజానే వేరు. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దామా

గోంగూర చికెన్ రెసిపీ
చికెన్ ఎప్పుడూ ఒకే స్టైల్లో వండుతున్నారా? ఎప్పుడూ ఒకే రకంగా తింటే ఏం బాగుంటుంది. ఒకసారి ఆంధ్రా స్టైల్లో కాస్త కారంగా, నోరూరించే పులుపుతో గోంగూర చికెన్ కర్రీ ట్రై చేయండి. ఈఫేమస్ కాంబినేషన్ అన్నం, జొన్న రొట్టె, చపాతీ, దోశల్లోకి అదిరిపోతుంది. మరి లేటేందుకు ఈ స్పెషల్ గోంగూర చికెన్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా…
చికెన్ మ్యారినేషన్‌కు కావాల్సిన పదార్థాలు
- చికెన్ - 500 గ్రాములు,
- పసుపు - ¼ టీస్పూన్,
- కారం - 1 టీస్పూన్,
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్,
- ఉప్పు - తగినంత,
- పెరుగు - 2 టీస్పూన్లు,
- నిమ్మరసం - 1 టీస్పూన్,
- గోంగూర ఆకులు
చికెన్ గ్రేవీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
- పెద్ద ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి),
- బిర్యానీ ఆకులు 2-3, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర,
- టమాటా - 1,
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్,
- కారం - 1 టీస్పూన్,
- ధనియాల పొడి - 1 1/2 టీస్పూన్,
- జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్,
- గరం మసాలా - 1/2 టీస్పూన్,
- మిరియాల పొడి - 1/2 టీస్పూన్,
- జీలకర్ర - 1/2 టీస్పూన్,
- కరివేపాకు - 1 రెమ్మ,
- నూనె - 3 నుంచి 4 టీస్పూన్లు,
- ఉప్పు - తగినంత,
- నీళ్లు - తగినన్ని,
- కొత్తిమీర - కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను బాగా కడిగి నీళ్లు వంపేయాలి. అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. అప్పుడే చికెన్‌కు మసాలా బాగా పట్టి, ఉడికేటప్పుడు సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది.
గోంగూరను వేయించుకోవడం
గోంగూరను వలిచి, బాగా కడిగి నీళ్లు వడకట్టాలి. ఒక కడాయిలో 2 టీస్పూన్ల నూనె వేడి చేసి, గోంగూర వేసి మీడియం మంట మీద వేయించాలి. ఆకులు బాగా ముడుచుకుని సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించాలి. ఆకుల్లోని పులుపుదనం బయటకు వచ్చి, బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
తాళింపు పెట్టడం
- ఒక కడాయిలో నూనె వేడి చేసి బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసి తాలింపు పెట్టాలి.
- ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
- తరిగిన టమాటాలు వేసి అవి సాఫ్ట్ అయ్యేదాకా మగ్గనివ్వాలి.
గొంగూర ఎప్పుడు వేయాలంటే?
ఆ తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి నూనె పైకి తేలేదాకా కలపాలి.
మ్యారినేట్ చేసిన చికెన్ వేసి 5 నుంచి 7 నిమిషాలు బాగా వేయించాలి. చికెన్ నుంచి నీళ్లు బయటకు వచ్చి మసాలాతో కలుస్తాయి.
తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి.
చికెన్ బాగా ఉడికాక, మనం వేయించి పెట్టుకున్న గోంగూరను చికెన్‌లో వేసి బాగా మిక్స్ చేయాలి.
పులుపు రుచి చికెన్‌కు బాగా పట్టి నూనె పైకి తేలేదాకా 2 నుంచి 4 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించాలి.
మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ బాగా ఉడికి, ఆకుకూర మసాలా చికెన్‌కు పట్టి, గ్రేవీ చిక్కబడేదాకా ఉడికించాలి. అంతే వేడివేడి గోంగూర చికెన్ రెడీ అవుతుంది.





