MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Anant Ambani: ఆ ఆలయంలో పావురాలను, మేకలను వదిలిపెట్టిన అనంత అంబానీ.. ఏమిటీ సాంప్రదాయం?

Anant Ambani: ఆ ఆలయంలో పావురాలను, మేకలను వదిలిపెట్టిన అనంత అంబానీ.. ఏమిటీ సాంప్రదాయం?

Anant Ambani: కామాఖ్య ఆలయంలో అనంత్ అంబానీ సంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు. అక్కడ పావురాలను ఎగరేయడం, మేకలను ఆలయానికి వదిలేశారు. ఇది అక్కడ కొనసాగుతున్న ఒక సంప్రదాయం. అసలు ఆలయంలో ఈ ఆచారం ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 17 2026, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పావురాలను ఎగరేసిన అనంత అంబానీ
Image Credit : PTI

పావురాలను ఎగరేసిన అనంత అంబానీ

ఆసియాలోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ. అంబానీ కుటుంబానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువ. అనంత్ అంబానీ మంగళవారం అస్సాంలోని గువాహటిలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  స్థానిక సంప్రదాయం ఆ ఆలయంలో ప్రకారం పావురాలను ఎగరేశారు. అలాగే మేకలను కూడా ఆలయ ప్రాంగణంలో విడిచిపెట్టారు. ఆ ఆలయ సందర్శనకు వెళ్లిన వారు ఇలా పావురాలను, మేకలను వదలడం ప్రత్యేక ఆచారం ఇప్పుడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కామాఖ్య ఆలయ విశిష్ఠత
Image Credit : Canva

కామాఖ్య ఆలయ విశిష్ఠత

కామాఖ్య ఆలయం మనదేశంలోని శక్తిపీఠాలలో ఒకటి. దీన్ని తాంత్రిక పూజలకు ప్రధాన కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారిని యోని రూపంలో పూజిస్తారు. దీన్ని విశ్వం జననానికి మూలంగా చెప్పుకుంటారు. కామాఖ్య దేవిని జగన్మాతగా భక్తులు నమ్ముతారు. ఇక్కడ శాస్త్రీయ పూజా విధానాలతో పాటు, స్థానికంగా ఉండే గిరిజన నమ్మకాలను కూడా పాటిస్తారు. ఈ ఆచారాలలో పావురాలను ఎగరేయడం, మేకలను వదిలివేయడం కూడా ఉన్నాయి.

Related Articles

Related image1
Newspaper Craft: పాత పేపర్లను పడేయకుండా వాటితో మీ ఇంటిని అందంగా మార్చేయండి
Related image2
Rahu: రాహువు వల్ల త్వరలో లాభపడే 4 రాశులు ఇవే.. వీరి టైమ్ మొదలైంది
34
పావురాలు, మేకలే ఎందుకు?
Image Credit : ANI

పావురాలు, మేకలే ఎందుకు?

కామాఖ్య ఆలయంలో భక్తులు మొక్కు తీర్చుకోవడానికి పావురాలను, మేకలను రెండింటినీ సమర్పిస్తారు. ఈ రెండు జీవులను అమ్మవారికి అర్పించడాన్ని 'జీవ సమర్పణ' అంటారు. ఈ త్యాగంలో ఎలాంటి రక్తపాతం, నొప్పి లేదా హింస ఉండదు. వాటిని బలి ఇవ్వరు. కేవలం ఆలయ ప్రాంగణంలో వదిలివేస్తారు. 

స్థానికంగా చెప్పే కథల ప్రకారం దంపతులు సంతానం కోసం కామాఖ్య అమ్మవారిని మొక్కుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత, వారు పావురాన్ని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ అక్కడున్న పావురాలన్నీ అరవడం మొదలుపెట్టడంతో, ఆ దంపతులు బలికి బదులుగా పావురాన్ని ఎగరేశారు. అప్పటి నుంచి అమ్మవారికి పావురాలను స్వేచ్ఛగా వదిలే పద్ధతి వచ్చింది. 

44
కామదేవుడితో సంబంధం
Image Credit : Getty

కామదేవుడితో సంబంధం

హిందూ ధార్మిక సంప్రదాయాలలో పావురాలకు కామదేవుడితో అనుబంధం ఉంది.   హిందూ పురాణాల ప్రకారం, ప్రేమ, కామానికి అధిపతి కామదేవుడు. అతని భార్య రతీదేవికి పావురాలంటే చాలా ఇష్టం. ప్రాచీన కాలంలోప్రేమలేఖలను చేరవేయడానికి పావురాలను ఉపయోగించేవారు. ప్రాచీన గ్రీకు, రోమన్ పురాణాలలో కూడా ప్రేమ దేవత అయిన వీనస్‌కు తెల్ల పావురాలతో సంబంధం ఉంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు
Recommended image2
Salt: ఉప్పు వంట కోసమే కాదు.. ఇంట్లో ఉన్న సమస్యలను కూడా పోగొడుతుందట
Recommended image3
Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?
Related Stories
Recommended image1
Newspaper Craft: పాత పేపర్లను పడేయకుండా వాటితో మీ ఇంటిని అందంగా మార్చేయండి
Recommended image2
Rahu: రాహువు వల్ల త్వరలో లాభపడే 4 రాశులు ఇవే.. వీరి టైమ్ మొదలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved