కాలుష్యం వల్ల ఆరోగ్యం పాడవకూడదంటే.. ఇమ్యూనిటీని పెంచే ఈ ఆహారాలను తప్పక తినండి..
చలికాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. కాలుష్యం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది కూడా. అందుకే ఈ సీజన్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తప్పకుండా తినండి.
air pollution
కాలుష్యం ఒక్క ఢిల్లీలోనే కాదు.. దేశంలోని ఎన్నో నగరాల్లో కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ కాలుష్యం పెరగడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ కాలుష్యం శీతాకాలంలో మరీ ఎక్కువవుతుంది. చాలా మెట్రో నగరాల్లో AQI స్థాయి 400 కంటే ఎక్కువకు చేరుకుంది. శీతాకాలంలో ఈ కాలుష్యం వల్ల మీరు, మీ కుటుంబ సభ్యుులు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తినాలి.
ఎలాంటి ఆహారాలను తినాలంటే..
కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ కారణంగా జలుబు, దగ్గు, ఆస్తమా వంటి రోగాలు ఎక్కువగా వస్తాయి. వీటితో పాటుగా ఈ కాలుస్యం గుండె సమస్యలను కూడా ఎక్కువ చేస్తుంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నా.. మీరు తినే ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఉండేట్టు చేసుకోవాలి.
black pepper
నల్లమిరియాలు, లవంగాలు, కలోంజీలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని బెల్లంతో కలిపి తింటే కాలుష్య ప్రభావం మీపై తక్కువ పడుతుంది. నల్ల మిరియాలు దగ్గు, జలువు నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తాయి. గుండెపోటు నుంచి రక్షిస్తాయి. బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. ఇవి జ్వరాన్ని కూడా తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి.
శీతాకాలంలో ఉల్లి, వెల్లుల్లిని తప్పకుండా తినాలి. వీటిని తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలుష్యం నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. ఉల్లిపాయ రసంలో బెల్లం కలుపుకుని తాగడం వల్ల జలుబు తొందరగా తగ్గిపోతుంది. వెల్లుల్లి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధిస్తుంది. మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. జలుబును తగ్గిస్తుంది. చర్మ సమస్యలను పోగొడుతుంది. నోటి ఆరోగ్యానికి కూడా ఇది మంచిది.
ఉసిరి రసంలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ సీజన్ లో దీన్ని తాగడం వల్ల చర్మం, జుట్టు, మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఈ రసం ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది కూడా. ఉసిరి గట్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
దగ్గు సమస్యతో ఇబ్బందిపడేవారికి నెయ్యి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇందుకోసం నెయ్యిలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి త కోవాలి. ఒకవేళ మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే పసుపులో వెన్న, బెల్లం కలిపి తీసుకోండి. ఇది శ్వాస సంబంధింత సమస్యలను పోగొడుతుంది. దీనిలో ఉండే నెయ్యి ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతుంది. అంతేకాదు ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది కూడా. ఒత్తిడిని తగ్గించి రాత్రిళ్లు హాయిగా నిద్రపోయేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.