Females Gain Weight After Marriage: పెళ్లి తర్వాత ఆడవాళ్లు బరువు పెరగడానికి అసలు కారణం ఇదేనా?
Females Gain Weight After Marriage: పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత ఒకలా మరిపోతుంటారు. అంటే పెళ్లి తర్వాత చాలా మంది అమ్మాయిలు బరువు పెరగడం సహజంగా జరుతూఉంటుంది. అయితే ఇలా పెరగడానికి కారణం పురుషుడి వీర్యమేనంటూ పలువురు చెబుతూ ఉంటారు. మరి ఇందులో నిజమెంతంటే...
Females Gain Weight After Marriage: పెళ్లికి ముందు సన్నగా ఉండే ఆడవారు పెళ్లి తర్వాత విపరీతంగా బరువు పెరిగి లావుగా అయిపోతుంటారు. పెళ్లి తర్వాతే ఇలా బరువు ఎందుకు పెరుగుతారని చాలా మందికి డౌట్లు ఉన్నాయి. అయితే ఇలా బరువు పెరగడానికి వీర్యమే కారణమని చాలా మంది చెప్తూ ఉంటారు. వీర్యం బలవర్థకమని అందుకే ఇలా పెళ్లి తర్వాత బరువు పెరుగుతారని భావిస్తుంటారు. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. పురుషుల వీర్యం ఎలాంటి బలాన్ని ఇవ్వలేదని.. మహిళలు బరువు పెరగడానికి, వీర్యానికి ఎలాంటి సంబంధమే లేదని నిపుణులు వెళ్లడిస్తున్నారు. పెళ్లికి ముందు సన్నగా ఉండేవారు పెళ్లి తర్వాత లావుగా అవడానికి ఎన్నో కారణాలున్నాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లైన కొత్తలో జంటలు వీలైనంత ఎక్కువ సమయం గడుపుతుంటారు. కబుర్లు, కాలక్షేపాలు, బయటకు వెళ్లి తరచుగా తినడం వంటివి చేస్తుంటారు. అందులో ఏ ఒక్కరు ఆహారప్రియులు ఉన్నా.. ఆటోమెటిక్ గా అవతలి వారు కూడా తింటారు. దీనివల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటే కూడా బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. పెళ్లి తర్వాత బరువు పెరగడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. ఇదే కాకుండా పెళ్లైన కొత్తలో భాగస్వామిని మెప్పించడం కోసం వచ్చిన వంటలన్నీ ఎంతో రుచికరంగా చేస్తుంటారు. వీటిని ఇద్దరూ కలిసి తింటారు. ఇది శరీరంలో ఫ్యాట్ పెరగడానికి కారణం అవుతుంది. ఫలితంగా బరువు ఈజీగా పెరుగుతారు.
అయితే ఒత్తిడిగా ఫీలయినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, విసుగ్గా ఉన్పప్పుడు కూడా ఎక్కువగా తింటారు. భార్యా భర్తల మధ్య గొడవలు ఏర్పడినప్పుడు కూడా ఎక్కువగా తినే అవకాశం ఉంది. అందులోనూ చాలా మంది గొడవలు వచ్చినప్పుడు కోపాన్ని అణచుకోవడానికి ఇలా ఎక్కువగా తింటూ ఉంటారట. దీనివల్ల కూడా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
పెళ్లి తర్వాత బరువు పెరగడానికి మరొక కారణం గర్భం దాల్చడం. గర్భాధారణ సమయంలో కూడా మహిళలు విపరీతంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. కడుపులో బిడ్డ పెరుగుతుండటం వల్ల కూడా మహిళలు తమ బరువును ఆటోమెటిక్ గా పెరుగుతారు. అందులోనూ ఆ సమయంలో హార్లోన్లు క్రమం తప్పడం, ఆహారం తినడంపై కోరికలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎక్కువగా తింటారు. అందువల్ల కూడా బరువు పెరుగుతారు.
బరువు పెరగడానికి మరొక ముఖ్యమైన కారణం ఒత్తిడి లేని లైఫ్ ను లీడ్ చేయడం. పెళ్లికి ముందు ఉన్న Tensions పెళ్లి తర్వాత చాలా వరకు ఉండవు. పెళ్లి ముందు అయితే ఫిట్ గా ఉండటం కోసం, వచ్చే భాగస్వామిని ఆకర్షించడం కోసం ఫుడ్ ను కొద్ది మొత్తంలో తీసుకోవడం, వ్యాయామాలు గట్రా చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే వారు చాలా మందే ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత ఆడవాళ్లు సన్నగా ఉండాలని, తమ భాగస్వామిని ఆకర్షించాలని అనుకోరట. అందుకే తమకు నచ్చే విధంగా ఉంటూ మంచిగ, పుష్టిగా ఆహారాన్ని తీసుకుంటారు. దీని వల్ల పెళ్లైన తర్వాత బరువు పెరుగుతారని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత సంతృప్తికరమైన జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వారే అధికంగా బరువుపెరుగుతారట.