Weight Loss: ఈ టిప్స్ తో ఊబకాయాన్ని ఉఫ్ మని ఊదేస్తారు తెలుసా..
Weight Loss: ప్రస్తుత కాలంలో ఫిట్ గా ఉండటమంటే సవాలుతో కూడుకున్న పని. దీనికోసం ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులను ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే మన బరువు నియంత్రణలో ఉండి. మనం ఫిట్ గా ఉండగలుగుతాం.

Weight Loss: Weight Loss: నేటి ఆధునిక కాలంలో ఫిట్ గా ఉండటమంటే మాటలు కావు. ఇది పెద్ద సవాలుతో కూడుకున్నది. ముందే మనదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తితో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం యే చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ పనిలో పడి ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. బయటదొరికే వాటితో కడుపు నింపుకుంటున్నారు. ఈ కారణం వల్లే చాలా మంది శరీర బరువు విపరీతంగా పెరిగిపోతోంది.
కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బరువును కోల్పోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంతమంది లంచ్ టైం లో సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్లే బరువు పెరిగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే బరువును ఈజీగా తగ్గొచ్చు. మరి మధ్యాహ్న సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కూరగాయలు: మన దేశంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కూరగాయల వల్లే శరీర బరువు సమతుల్యంగా ఉంటుంది. వీటి ద్వారానే మన శరీర సమతుల్యతను కాపాడుకోవచ్చు. కాబట్టి మధ్యాహ్నం భోజనంలో విటమిన్ ఎ ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆకుకూరల ద్వారా మనకు ఇవి పుష్కలంగా అందుతాయి. అంతేకాదు ఇవి ఎన్నో రోగాలు రాకుండా చేస్తాయి.
పప్పు: పపుులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కందిపప్పు మటన్ తో సమానం . ఎందుకంటే ఈ పప్పులో ఐరన్, ప్రొటీన్, జింక్ మెండుగా ఉంటాయి. అలాగే శనగలు మన శరీరం డీ హైడ్రేట్ బారిన పడకుండా కాపాడుతాయి. కాబట్టి మీరు మీ రోజు వారి ఆహారంలో వివిధ రకాల పప్పులు ఉండేలా చూసుకోండి.
పెరుగు: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అందుకే మీరు మధ్యాహ్నం పూట పెరుగును ఎలాంటి అనుమానాలు లేకుండా తినొచ్చు. దీనిని తినడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు ఈ పెరుగును రుచిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.