ఎసిడిటీ ఇందుకే వస్తుంది.. ఈ అలవాట్లు మార్చుకోండి..
మనలో చాలా మంది ఎసిడిటీతో ఇబ్బంది పడుతుంటారు. కడుపులో ఆమ్లాలన్ని ఉత్పత్తి చేసే జీర్ణశయాంతర గ్రంధుల వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. కానీ ఈ సమస్య వల్ల కుదురుగా ఉండలేరు. కడుపు నిండా తినలేరు.

acidity
ఎసిడిటి సమస్య ఉదర గ్రంథులు అదనపు ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముందుగా మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుంటే కూడా తరచుగా ఈ సమస్య వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో జీర్ణక్రియను బలహీనపరుస్తుంది. ఎసిడిటీ వల్ల గుండెల్లో మంట పుడుతుంది. మంటగా అనిపిస్తుంది కూడా. అలాగే పుల్లటి తేన్పులు కూడా వస్తుంటాయి. అంతేకాదు కొంతమందికి వాంతులు కూడా అవుతుంటాయి. అలాగే గొంతులో, జీర్ణాశయంలో మెదులుతున్న భావన కలుగుతుంది. ఈ సమస్య వల్ల తిన్నది సరిగ్గా అరగదు. ఒక్కోసారి విరేచనలు కూడా అవొచ్చు. ఎసిడిటీ మరింత ఇబ్బంది పెడితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది. అసలు ఈ ఎసిడిటీకి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Acidity
టీ, కాఫీ
భోజనం చేసినా.. చేయకపోయినా టీ, కాఫీలు తాగకుండా ఉండని వారు చాలా మందే ఉంటారు. ఇక ఆఫీసుల్లో పనిచేసే వారైతే గంట గంటలకు కాఫీలను తాగేస్తుంటారు. మీకు తెలుసా.. టీ, కాఫీ లను ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది. కార్బోనేటేడ్ పానీయాలు, కాఫీ, హార్డ్ టీ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే టీ, కాఫీలను తాగే అలవాటును మానుకోండి. రోజకు రెండు కప్పులకు మించి తాగితే ఎసిడిటీ వస్తుంది.
acidity
వేళకు తినకపోవడం
టైం ప్రకారం తినడం చాలా ముఖ్యం. అప్పుడే జీర్ణక్రియ, జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది.ఎందుకంటే మనం రోజూ తినే సమయానికి మన కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఈ ఆమ్లం ఫుడ్ ను విచ్చిన్నం చేయడానికి సహాయపడుతుంది. అయితే ఈ ఆమ్లం మనం తిన్నా.. తినక పోయినా ఉత్పత్తి అవుతుంది. వేళకు భోజనం చేయకపోవడం వల్ల కడుపులో ఈ ఆమ్లం పేరుకుపోతుంది. దీనివల్ల వికారం.. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు వస్తాయి.
Acidity
ధూమపానం
ధూమపానం ఏ రకంగా చూసుకున్నా మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ఒక వ్యసనం లాంటిది. దీనికి అలవాటు పడితే అంత తొందరగా బయటపడలేరు. దీనివల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలొస్తాయి. ధూమపానం, అధిక కొవ్వు ఉన్న ఆహారాలను తినడం వల్ల కూడా ఎసిడిటీకి సమస్య వస్తుంది. స్మోకింగ్ చేయడం వల్ల అధిక కేలరీలున్న ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. అలాగే ఎసిడిటీకి దారితీస్తుంది.
తిన్నవెంటనే నిద్రపోవడం
తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిద్రపోయే ముందు తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అధ్వాన్నంగా మారుతుంది. ఎందుకంటే భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మరింత కష్టమవుతుంది. నిద్రపోవడానికి రెండు, మూడు గంటల మందే తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి
నిద్రలేమి వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోగాలొస్తాయ్. ముఖ్యంగా తక్కువగా నిద్రపోవడం వల్ల కడుపులో ఎక్కువ ఆమ్లం ఏర్పడటానికి దారితీస్తుంది. దీని వల్ల చికాకుపెడుతుంది. యాసిడ్ అన్నవాహికకు చేరుతుంది. గుండెల్లో మంట పుడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను కూడా కనిపిస్తాయి.