MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Fridge: ఊరెళ్తున్నామని ఫ్రిజ్ ఆఫ్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Fridge: ఊరెళ్తున్నామని ఫ్రిజ్ ఆఫ్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

 Fridge: ఎండాకాలం కదా అని ఊరెళ్తున్నారా? ఇంట్లో ఉండం కదా.. కరెంట్ బిల్లు ఆదా చేద్దాం అని ఫ్రిజ్ ఆఫ్ చేస్తున్నారా? అసలు ఫ్రిజ్ ఆఫ్ చేయడం మంచి పద్దతేనా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 23 2026, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Fridge..
Image Credit : Getty

Fridge..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటోంది. ఇదొక నిత్యావసర వస్తువు గా మారిపోయింది. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయల దగ్గర నుంచి తినే ప్రతి ఆహార పదార్థాన్ని ఫ్రిజ్ లోనే స్టోర్ చేస్తున్నాం. ఇది రోజుకి 24 గంటలు పని చేస్తుంది.అయితే.. ప్రస్తుతం ఎండాకాలం వచ్చింది. చాలా మంది తమ సొంత ఊళ్లకు, లేదా ఎక్కడికైనా ట్రిప్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. ఆ సమయంలో కరెంట్ బిల్లు ఆదా చేసుకోవడానికి చాలా మంది ఫ్రిజ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలానే చేస్తున్నారా? అసలు.. ఫ్రిజ్ ఆఫ్ చేయడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎన్ని రోజులు ఊరు వెళ్తున్నారు..?
Image Credit : Getty

ఎన్ని రోజులు ఊరు వెళ్తున్నారు..?

మీరు కేవలం 2 నుంచి 4 రోజుల పాటు మాత్రమే ఊరికి వెళ్తున్నట్లయితే.. రిఫ్రిజిరేటర్ ను ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు పాలు, పండ్లు, కూరగాయలు లేదా త్వరగా పాడైపోయే ఇతర నిత్య అవసర వస్తువులను అందులో ఉంచుతున్నట్లయితే.. మీరు ఫ్రిజ్ ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రిజ్ ని ఆన్ లో ఉంచడం వల్ల ఈ వస్తువులు ఏవీ పాడవ్వవు. సురక్షితంగా ఉంటాయి.

మీరు రిఫ్రిజిరేటర్ ను నిరంతరం ఆన్, ఆఫ్ చేయడం దాని కంప్రెసర్ పై ఒత్తిడిని పెంచుతుంది. ఇది దాని విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మీరు కేవలం కొన్ని రోజులు మాత్రమే బయటకు వెళ్తున్నప్పుడు మీ ఫ్రిజ్ ను ఆన్ లో ఉంచడమే మంచిది. ఆఫ్ చేయకూడదు.ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫ్రిజ్ లు మంచి టెక్నాలజీతో డెవలప్ చేశారు. వీటి వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా రాదు. మరీ ముఖ్యంగా ఈ రెండు, మూడు రోజులకు మీ కరెంట్ బిల్లులో పెద్ద మార్పు ఏమీ రాదు.

33
ఎక్కువ రోజులు ఇంట్లో ఉండకపోతే...?
Image Credit : Generated by google gemini AI

ఎక్కువ రోజులు ఇంట్లో ఉండకపోతే...?

మీరు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండకపోతే ఫ్రిజ్ ని ఆఫ్ చేయచ్చు. అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫ్రిజ్ ని పూర్తిగా ఖాళీ చేయాలి. మరీ ముఖ్యంగా పాడైన వస్తువులు ఏమైనా ఉంటే.. వాటిని తీసేయాలి. వీలైనంత వరకు ఫ్రిజ్ లో ఒక్క వస్తువు కూడా ఉండకూడదు. అలా కాకుండా ఏవైనా వస్తువులు ఉంచితే.. ఫ్రిజ్ దుర్వాసన రావడమే కాకుండా, బూజు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి... వస్తువులు అన్నీ తొలగించి, ఫ్రిజ్ ని పొడిగా ఉంచాలి. అప్పుడు మాత్రమే ఆఫ్ చేయాలి.

ఫ్రిజ్ ని వాడే విధానం...

మనం ఫ్రిజ్ ని సరిగా వాడితే అది ఎక్కువ రోజులు పని చేస్తుంది. మరీ ముఖ్యంగా, వేడిగా ఉండే ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ముందుగా దానిని చల్లారనివ్వాలి. అంతేకాదు.. ఫ్రిజ్ ని ఎక్కువ వస్తువులను నింపేయకూడదు. గాలి సరిగా ప్రసరించేలా ఉండాలి. ఎక్కువ వస్తువులు ఫ్రిజ్ లో ఉంచితే.. చల్లని గాలి సరిగా ప్రసరించకుండా నిరోధిస్తుంది. అందుకే, ఈ విషయంలో తప్పులు చేయకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి నల్లగా మారిందా? ఇలా చేస్తే రెండు రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved