Hygiene Tips: బ్రష్ ఎన్ని నెలలకు మార్చాలి? బెడ్ షీట్లు ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి?
Hygiene Tips: శుభ్రంగా ఉండాలని మనం రోజూ ఎలా స్నానం చేస్తామో.. మనం వాడే వస్తువుల విషయంలో కూడా ఇదే శుభ్రత పాటించాలి. ముఖ్యంగా మనం రెగ్యులర్ గా వాడే లో దుస్తుల నుంచి.. బెడ్ షీట్ల వరకు ఎన్నిరోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా?

Hygiene Tips
ఆరోగ్యంగా ఉండాలంటే… హెల్దీ ఫుడ్ తినడం ఎంత ముఖ్యమో.. శుభ్రత పాటించడం కూడా అంతే ముఖ్యం. కేవలం మన శరీర శుభ్రత మాత్రమే కాకుండా.. మనం రెగ్యులర్ గా వాడే వస్తువులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. మరి.. మీరు రెగ్యులర్ గా ఉపయోగించే టూత్ బ్రష్ ని ఎన్ని నెలలకు ఒకసారి మారుస్తున్నారు? బెడ్ షీట్లు, పిల్లో కవర్స్ ని ఎంత ఫ్రీక్వెంట్ గా ఉతుకుతున్నారు? అసలు.. వేటిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

లో దుస్తులు..
ప్రతి ఒక్కరూ లో దుస్తులను ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే.. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే.. లో దుస్తులను ఉపయోగించిన ప్రతిసారీ కచ్చితంగా ఉతకాలి. ప్రైవేట్ పార్ట్స్.. ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచాలంటే వీటిని ఎక్కువ రోజులు వాడకూడదు. ఒకసారి వేసుకుంటే.. ఉతికిన తర్వాత మాత్రమే మళ్లీ ధరించాలి.
టూత్ బ్రష్...
నోరు ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ గా బ్రష్ చేయడం చాలా అవసరం. సరిగా శుభ్రం చేయకపోతే.. నోటిలో బ్యాక్టీరియా పెరిగి.. ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కాబట్టి… వాడిన ప్రతిసారీ బ్రష్ ని శుభ్రం చేయాలి. అంతేకాదు.. ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా బ్రష్ ని మార్చాలి. తడి ప్రదేశంలో బ్రష్ పెడితే బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి.. బ్రష్ ని పొడి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి.
పిల్లో కవర్స్..
మన ఆరోగ్యానికి దిండు కవర్లు కూడా చాలా ముఖ్యం. వీటిని మూడు, నాలుగు రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. మన తలలోని మురికి, నిద్రలో పట్టే చెమట దిండు కవర్‌పై చేరి మొటిమలు, చర్మ సమస్యలకు కారణమవుతాయి. దీనివల్ల తరచూ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. అందుకే మూడు, నాలుగు రోజులకు ఒకసారి వీటిని ఉతకాలి. అలాగే, ఆరు నెలలకు ఒకసారి దిండులను మార్చడం మంచిది. అలాగే, బెడ్‌షీట్లు, దుప్పట్లను నెలకు ఒకసారి ఉతకాలి. బాగా పాతబడిన దుప్పట్లను వెంటనే మార్చేయాలి. కనీసం ఆరు నెలలకు ఒకసారి కొత్త దుప్పటి కొనుక్కోవచ్చు.
జీన్స్...
కొంతమంది జీన్స్ ప్యాంట్ వేసుకుంటే, దాన్ని వారాల తరబడి ఉతకకుండా వాడుతుంటారు. కానీ అది తప్పు. జీన్స్ ప్యాంట్లను తరచుగా ఉతకకూడదు. కానీ, నాలుగైదు సార్లు వేసుకున్న తర్వాత కచ్చితంగా ఉతకాలి. ఇక, టవల్స్ విషయానికి వస్తే… ఇవి కూడా క్రిములను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. అందుకే టవల్ ని రెండు రోజులకు ఒకసారి అయినా ఉతికి ఎండలో ఆరేయాలి. ఆరు నెలలకు మించి టవల్ ని వాడకూడదు.
మొబైల్ ఫోన్స్...
మనం రోజూ వాడే సెల్‌ఫోన్‌లపై మురికి, ఫంగస్ సులభంగా చేరుతాయి. ఇవి చేతుల ద్వారా మన శరీరంలోకి చేరి చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమల సమస్యలను సృష్టిస్తాయి. అందుకే రోజూ ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ వైప్స్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో సెల్‌ఫోన్‌ను శుభ్రం చేయాలి. బాత్రూమ్, టాయిలెట్ వంటి ప్రదేశాలకు సెల్‌ఫోన్ తీసుకెళ్లడం మానేయాలి.
వంటగది బట్టలు
వంటగదిలో వేడి గిన్నెలు పట్టుకోవడానికి వాడే బట్టలు తడిగా ఉండటం వల్ల, అవి బ్యాక్టీరియా, ఫంగస్‌కు నిలయంగా మారతాయి. కాబట్టి వీటిని సరిగ్గా శుభ్రం చేయాలి. వేడి నీటిలో ఉతికి ఎండలో ఆరబెట్టాలి.
వాటర్ బాటిళ్లు, గ్లాసులను కూడా రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. నీళ్లు పట్టే పాత్రలు, గ్లాసులు, వాటర్ బాటిళ్లను శుభ్రం చేయడం చాలా అవసరం. స్టీల్ బాటిల్ అయితే, వేడి నీటిలో సబ్బు వేసి కడిగి, బ్రష్‌తో బాగా శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి వెనిగర్ లేదా బేకింగ్ సోడా ఉపయోగించి క్రిములను తొలగించవచ్చు.
