MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Salt: కూరలో రుచికి కాదు, ఉప్పును కిచెన్ లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?

Salt: కూరలో రుచికి కాదు, ఉప్పును కిచెన్ లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?

Salt: ఏ కూరకు అయినా రుచి తేవాలంటే అందులో ఉప్పు ఉండాల్సిందే. కానీ, కేవలం వంటలో రుచికి మాత్రమే కాదు, ఉప్పును కిచెన్ లో చాలా రకాలుగా వాడొచ్చు. చాలా మందికి ఈ విషయం అస్సలు తెలీదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 06 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Cooking Tips
Image Credit : Gemini AI

Cooking Tips

మన వంటింట్లో ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కూర చేయాలన్నా.. అందులో ఉప్పు పడితేనే అసలైన రుచి. పచ్చళ్లు పాడవ్వకుండా ఉండాలన్నా, మాడిపోయిన కూరను మళ్లీ సరిచేయాలన్నా, రాగి, ఇత్తడి సామాన్లు మెరిపించాలన్నా.. ఉప్పు కావాల్సిందే. ఇవి మాత్రమే కాకుండా.. కిచెన్ లో ఉప్పును ఎన్ని రకాలుగా ఉపయోగించచ్చో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు రావద్దంటే...
Image Credit : Pixabay

1.ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు రావద్దంటే...

ఉల్లిపాయ కోస్తుంటే ఎవరికైనా సహజంగా కళ్ల నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. కానీ, మీరు మీ కటింగ్ బోర్డుపై చల్లి.. దానిపై ఉల్లిపాయలు కోయాలి. ఇలా చేస్తే.. ఉప్పు వాటిలోని తేమను లాగేస్తుంది. దీని వల్ల, కంటి నుంచి నీళ్లు రావు. అంతేకాదు.. చాపింగ్ బోర్డుపై ఉల్లిపాయ వేసి.. రెండువైపులా రుద్దితే దానిమీద పొట్టు తొందరగా పోతుంది.

2. బెండకాయ మంచిగా ఫ్రై అవ్వాలంటే..

బెండకాయలు, క్యాబేజీ లేదా పుట్టగొడుగులను వండే ముందు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇది వాటిలోని అదనపు నీటిని పీల్చేస్తుంది. దీనివల్ల వండేటప్పుడు కూర ముద్దగా మారిపోకుండా, ఎంతో కరకరలాడే క్రిస్పీ టెక్చర్‌ను ఇస్తుంది.

3. కాకర కాయలో చేదు పోవాలంటే..

కాకరకాయ లేదా మెంతుకూర వంటి చేదు పదార్థాలకు ఉప్పు రాసి కాసేపు నాననిచ్చి కడిగితే చేదు చాలావరకు తగ్గిపోతుంది. మరోవైపు, స్వీట్లు చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే అది వంటకం లోని తియ్యదనాన్ని మరింత అద్భుతంగా హైలైట్ చేస్తుంది!

34
మాడిపోయిన పాత్రలు శుభ్రం చేయడానికి..
Image Credit : AI Image

మాడిపోయిన పాత్రలు శుభ్రం చేయడానికి..

కడాయి అడుగు భాగం మాడిపోయిందా? అయితే కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తోమండి. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా మీ ఇత్తడి, రాగి పాత్రలు కొత్త వాటిలా మెరిసిపోతాయి.

పర్ఫెక్ట్ బాయిలింగ్ సీక్రెట్: గుడ్లు, బంగాళాదుంపలు లేదా పాస్తా ఉడికించే నీటిలో కొద్దిగా ఉప్పు వేయండి. ఇది వాటి టెక్చర్‌ను గట్టిగా ఉంచడమే కాకుండా, ఉడికిన తర్వాత గుడ్ల పొట్టు సులభంగా వచ్చేలా చేస్తుంది. పాస్తా ఉడికించే నీరు సముద్రపు నీటిలా ఉప్పుగా ఉంటేనే రుచి అదిరిపోతుంది.

44
6. కూరగాయల సహజ రంగు చెడిపోకుండా:
Image Credit : Pixabay

6. కూరగాయల సహజ రంగు చెడిపోకుండా:

పులావ్‌లో వేసే ఆకుకూరలు లేదా బీన్స్ ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తే వాటి రంగు మారకుండా తాజాగా మెరుస్తుంటాయి. కూరగాయలు సమానంగా ఉడికి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

7. పచ్చళ్లు, పిండి పులియబెట్టడంలో కీలక పాత్ర:

మామిడికాయ పచ్చడి నుండి దోశ పిండి వరకు ఉప్పు లీడ్ రోల్ పోషిస్తుంది. ఇది అదనపు తేమను లాగేసి, చెడిపోయేలా చేసే బ్యాక్టీరియాని అడ్డుకుంటుంది. పర్ఫెక్ట్ పులియబెట్టడానికి తగినంత ఉప్పు కచ్చితంగా ఉండాల్సిందే.

8. చేదు కాఫీ, మాడిపోయిన కూరకు చెక్:

కాఫీ చాలా చేదుగా అనిపిస్తే చిటికెడు ఉప్పు కలపండి, రుచి మారిపోతుంది. ఒకవేళ కూర మాడిపోతే కొద్దిగా ఉప్పు, తాజా కొత్తిమీర వేయండి.. ఆ వాసన తగ్గి కూర మళ్లీ తినడానికి వీలుగా మారుతుంది.

9. స్నాక్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా:

ఇంట్లో చేసుకున్న చిప్స్, చెక్లీలు ఒక్క రోజులోనే మెత్తగా మారిపోతూ ఉంటాయి. వేయించిన వెంటనే వాటిపై లైట్‌గా ఉప్పు చల్లితే తేమను దరిచేరనివ్వవు. చట్నీలు కూడా ఉప్పు ఎక్కువగా ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Chain: తక్కువ బరువులో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్స్ చూసేయండి
Recommended image2
Long Haram: పట్టుచీరల మీదకు పర్ఫెక్ట్ గా సూటయ్యే నక్లెస్ హారం సెట్స్
Recommended image3
Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే గోల్డ్ నల్లపూసల డిజైన్లు
Related Stories
Recommended image1
Dal: కంది పప్పుకీ, ఎర్ర కంది పప్పుకీ తేడా ఏంటి? రెండింటిలో ఏది తింటే మంచిది?
Recommended image2
Insect: ప్రపంచంలోనే అందమైన పురుగు... ఇది కనిపిస్తే ఎక్కువ సంతోషించేది ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved