Mosquito: ఈ మొక్కలు ఉంటే.. ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..!
సాయంత్రం అయితే చాలు.. ఇంట్లోకి దోమలు దూరేస్తాయి. ఇక దోమలు కుడితే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. డెంగ్యూ, మలేరియా లాంటివన్నీ ఈ దోమల కారణంగానే వస్తాయి.

దోమలు తిరిమికొట్టే మొక్కలు
వర్షాకాలం ఆల్రెడీ మొదలైపోయింది. వాతావరణం చల్లగా మారడం అందరికీ హాయిగా అనిపిస్తుంది. కానీ, ఈ సీజన్ లో వచ్చే దోమలు మాత్రం అందరినీ ఇబ్బంది పెట్టేస్తాయి. సాయంత్రం అయితే చాలు.. ఇంట్లోకి దోమలు దూరేస్తాయి. ఇక దోమలు కుడితే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. డెంగ్యూ, మలేరియా లాంటివన్నీ ఈ దోమల కారణంగానే వస్తాయి. ఇక దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఏవోవే కాయిల్స్, ఆయిల్స్ వాడతారు. వాటితో అవసరం లేకుండా.. కేవలం మీ చిన్ని గార్డెన్ లో కొన్ని మొక్కలు పెంచితే చాలు. కొన్ని మొక్కల వాసనలకు దోమలు ఇంట్లోకి అడుగుపెట్టవు. మరి, ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
పుదీనా..
పుదీనాని దాదాపు అందరూ వంటలకు వాడుతూ ఉంటారు. ఈ పుదీనా మొక్కను చాలా మంది తమ గార్డెన్ లో పెంచుకుంటూనే ఉంటారు. ఈ పుదీనా వాసన కూడా దోమలకు అస్సలు నచ్చదు. అందుకే ఈ మొక్క పెంచుకుంటే దోమలు దరిచేరవు. వంటగది, ఇల్లు పుదీనా నూనెతో తుడిస్తే కూడా దోమలు రావు.
ఇంగువ
ఇంగువ వాసన దోమలకి నచ్చదు. ఈ మొక్కకి మంచి ఎండ పడే చోట పెంచాలి. కిటికీల దగ్గర, బాల్కనీలో ఈ మొక్కని సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్కను మీరు మీ ఇంటి ఆవరణలో పెంచితే.. దోమలు అస్సలు అడుగుపెట్టవు.
రోజ్మేరీ
దోమల్ని తరిమికొట్టడానికి రోజ్మేరీ మొక్క చాలా బాగుంటుంది. ఈ మొక్కకి మంచి ఎండ, నీరు తగినంత ఉండే మట్టి కావాలి. తరచూ నీళ్ళు పోయాలి. కాస్త శ్రమ పెట్టి ఈ మొక్కను పెంచుకుంటే.. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవచ్చు.
యూకలిప్టస్
యూకలిప్టస్ మొక్కని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. బాల్కనీలో లేదా ఎండ పడే చోట పెంచుకోవచ్చు. దీని వాసన దోమలకి నచ్చదు. ఈ నూనెను ఇల్లు తుడవడానికి వాడినా కూడా దోమలు రాకుండా అడ్డుకోవచ్చు.
చామంతి
చూడడానికి అందంగా ఉండే చామంతి పువ్వు వాసన దోమలకి అస్సలు నచ్చదు. అందుకే చామంతి మొక్క ఇంట్లో ఉంటే దోమలు, ఇతర కీటకాలు దరిచేరవు.
భృంగరాజ మొక్క
జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే మొక్క భృంగరాజ. దోమల్ని తరిమికొట్టడానికి కూడా ఈ మొక్క బాగా పనిచేస్తుంది. గాజు గ్లాసులో లేదా జాడీలో ఈ మొక్కని పెంచుకోవచ్చు.