ఆకలి కాకపోవడానికి కారణాలు ఇవే.. ఆకలి పెరగాలంటే ఇలా చేయండి..
మన శరీరానికి టైం టూ టైం ఫుడ్ కావాలి. లేదంటే ఒంట్లో సత్తువ తగ్గుతుంది. దీంతో ఎన్నో రోగాలు వస్తాయి. అయితే ఈ రోజుల్లో చాలా మందికి ఆకలి లేకపోడం ఒక సమస్యగా మారిపోయింది. ఇలా అనిపించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఆకలి బాగా అవుతుంది. అవేంటంటే..
మనం తినే ఆహారమే మన ఒంటికి శక్తినిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ఆహారం మన రోజు వారి పనులను చేసుకోవడానికి చాలా చాలా అసవరం. అసలు మనం బతకాలంటే పుష్కలంగా తినాల్సిందే. కానీ కొంతమందికి అస్సలు ఆకలి ఉండదు. దీనివల్ల వారు మరింత వీక్ గా మారతారు. అయితే ఎప్పుడూ ఆకలి లేకపోవడానికి కొన్ని అంతర్లీన సమస్యలే కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటేంటే..
stress
ఒత్తిడి
ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనం ఒత్తిడిలో ఉంటే కేంద్ర నాడీ వ్యవస్థ జీర్ణక్రియను మందగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో ఆకలి బాగా తగ్గుతుంది. దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడి, నిరాశతో ఉన్నవారికిక దీర్ఘకాలికంగా ఆకలి వేయదు. ఈ సమస్యలు తినాలనే కోరికను తగ్గిస్తాయి.
అంటువ్యాధులు
ఆకలిని కూడా ప్రభావితం చేసే రోగాలలో జలుబు, ఫ్లూ, దగ్గు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నాయి. శ్వాసకోశ సమస్యలు, సైనస్, నాసికా రద్దీ.. వాసన, రుచికి ఆటంకం కలిగిస్తాయి. అలాగే ఆకలిని తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ లేదా ఫైబ్రోమైయాల్జియా కారణంగా కండరాల నొప్పి దీర్ఘకాలం పాటు ఉంటుంది.ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఆకలి తగ్గడానికి దారితీసే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హైపోథైరాయిడిజం, పోషక లోపాలు (జింక్ లోపం), హెపటైటిస్, హెచ్ఐవి, మూత్రపిండాలు, కాలేయ వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్లు.
మందులు
యాంటీబయాటిక్స్, యాంటీహైపర్టెన్సివ్స్, మూత్రవిసర్జన ఉపశమనం వంటి మందులు రేడియోథెరపీ, కెమోథెరపీ, పెరిటోనియల్ డయాలసిస్ వంటి చికిత్సల మాదిరిగానే ఆకలిని తగ్గిస్తాయి.
వయసు
వయస్సు కూడా ఆకలిని తగ్గిస్తుతంది. ఆకలి తగ్గడానికి వయస్సు ఒక కారకమంటున్నారు నిపుణులు. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ జీవక్రియ తగ్గుతుంది. హార్మోన్ల పనితీరును తగ్గుతుంది. పెద్ద వయసు వారు ఆహారాన్ని నమలగలిగే సామర్థ్యాన్ని తక్కువగా కలిగి ఉంటారు.
pregnancy
ప్రెగ్నెన్సీ
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో హార్మోన్లు ఎన్నో మార్పులకు గురవుతాయి. ఇది ఆకలి తగ్గడానికి దారితీస్తుంది. గర్భధారణ సమయంలో ఉదయం వికారం, గుండెల్లో మంట, వాంతులు మొదలైన సమస్యలు ఉంటాయి. వీటివల్ల కూడా ఆకలి వేయదు.
fruits
ఆకలిని పెంచే మార్గాలు
ఒంటరిగా తినకండి
ఒంటరిగా తినాలనిపించదు. తిన్నా కొద్దిగానే తింటారు. కొంతమందికి ఒంటరిగా ఉంటే అసలే తినాలనిపించదు. అందుకే స్నేహితులు లేదా కుటుంబసభ్యులతోనే భోజనం చేయండి. మందిలో తింటే రుచికరమైన భోజనం చేయాలనే కోరిక పెరుగుతుంది.
పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి
తక్కువగా తినే వారు అవోకాడో సలాడ్ లేదా స్మూతీ, చిలగడదుంప చాట్, కాయలు, విత్తనాల మిశ్రమం వంటి కేలరీలు, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్నే తినండి. మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలను తినండి.
drink water
తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినండి
మీరు ఒకేసారి ఇంతంతా తినాలనేం లేదు. రోజుకు నాలుగైదు సార్లైనా తినండి. అది కూడా కొద్ది కొద్దిగా. దీనివల్ల మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. బరువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
అలారం ను సెట్ చేయండి
ఒత్తిడి, నిరాశ లేదా ఆందోళన ఉన్నవారు తినడానికి అలారం ను సెట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వీళ్లు ఒత్తిడిలో ఉంటే తినడాన్ని మర్చిపోయే అవకాశం ఉంది.
బాగా నిద్రపోండి
శరీర సిర్కాడియన్ రిథమ్ ఆకలిని నియంత్రించగలదు. అందుకే రోజూ 7 నుంచి 9 గంటలు గాఢనిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. పేలవంగా నిద్రపోయే వారు ఎక్కువ లేదా తక్కువ ఆకలిని కలిగి ఉంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.