Jumping Jacks: ఈ ఒక్కటి 5 నిమిషాలు చేస్తే చాలు.. రిజల్ట్ మామూలుగా ఉండదు!
ఉదయాన్నే వ్యాయామం చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది త్వరగా లేచి వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ ఆలస్యంగా లేవడం వల్ల చేయలేరు. ఇక అలాంటివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదయం ఎంత ఆలస్యంగా లేచినా 5 నిమిషాలు ఈ ఒక్క వ్యాయామం చేస్తే చాలు. సూపర్ ఫలితాలు పొందవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వ్యాయామం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. వారానికి 5 రోజులైనా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామందికి గంటలపాటు వ్యాయామాలు చేయడం ఇష్టముండకపోవచ్చు. అలాంటి వారు సింపుల్ గా ఐదు నిమిషాలు జంపింగ్ జాక్స్ చేస్తే చాలు. శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోజూ ఉదయం ఐదు నిమిషాలు జంపింగ్ జాక్స్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. గుండె ఆరోగ్యానికి మేలు
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జంపింగ్ జాక్స్ ఒక గొప్ప మార్గం. ఈ సులభమైన వ్యాయామం హార్ట్ బీట్ రేటును పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా కార్డియో వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
2. మెరుగైన రక్త ప్రసరణ
జంపింగ్ జాక్స్ చేయడం వల్ల చేతులు, కాళ్ళు వంటి మొత్తం కండరాలు ఒకేసారి పనిచేస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉంటుంది. ఈ వ్యాయామంతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుకుగా పనిచేసుకోవడానికి ఈ వ్యాయామం చాలా సహాయపడుతుంది.
3. శక్తి స్థాయిలు పెరుగుతాయి
జంపింగ్ జాక్స్ వ్యాయామం ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది శక్తి స్థాయిలను పెంచడంలో, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికి ప్రేరేపిస్తుంది.
4. బరువు తగ్గడానికి
జంపింగ్ జాక్స్ అనేది కేలరీలను వేగంగా బర్న్ చేసే గొప్ప వ్యాయామం. మీరు బరువు తగ్గాలనుకుంటే, ఈ వ్యాయామాన్ని ప్రతిరోజూ చేయండి. ఈ వ్యాయామాన్ని దినచర్యలో చేర్చుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.
5. ఒత్తిడి తగ్గుతుంది
ఈ వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా ఏకాగ్రత, మానసిక స్పష్టతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదయం ఒత్తిడిని తగ్గించడానికి జంపింగ్ జాక్స్ సహాయపడుతాయి. ఇది ఆందోళనను ఎదుర్కోవడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ప్రశాంతమైన, ఏకాగ్రత కలిగిన మనస్సుతో మీ రోజును ప్రారంభించాలనుకుంటే, ఈ వ్యాయామం మంచి ఎంపిక.