పిల్లలను కౌగిలించుకొని మాట్లాడటం వల్ల ఇన్ని ప్రయోజనాలా?
Telugu
కౌగిలింతలతో ఆరోగ్య ప్రయోజనాలు
మీరు మీ పిల్లలను కౌగిలించుకున్నప్పుడు వారు ఎంతో భావోద్వేగానికి లోనవుతారు. దీనివల్ల వారి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Telugu
హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి
పిల్లలను కౌగిలించుకున్నప్పుడు వారిలో ఆనందాన్ని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. ఇలా తరచూ చేయడం వల్ల వారి మానసిక స్థితి మెరుగుపడుతుంది. వారికి భద్రత కూడా కలుగుతుంది.
Telugu
మానసికంగా స్ట్రాంగ్ అవుతారు
మీరు మీ పిల్లలను కౌగిలించుకున్నప్పుడు వారి శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల పిల్లలు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు.
Telugu
పిల్లలు తెలివిగా తయారవుతారు
మీరు మీ పిల్లలను తరచూ కౌగిలించుకోవడం వల్ల వారి మెదడు అభివృద్ధి చెందుతుంది. ఇలా చేయడం వల్ల వారు మానసికంగా మరింత చురుకుగా ఉంటారు.
Telugu
ఒత్తిడిని తగ్గిస్తుంది
మీరు మీ పిల్లలను కౌగిలించుకున్నప్పుడు వారి శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల కార్టిసాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల పిల్లలలో ఒత్తిడి తగ్గుతుంది.
Telugu
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితం పట్ల వారిలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. కుటుంబమంతా వారిని చాలా ప్రేమిస్తుందని వారు భావిస్తారు.