చలికాలంలో ఉసిరికాయలను తింటే ఎన్ని లాభాలను పొందుతారో..!
చలికాలంలో దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యలతో పాటుగా.. జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ సీజన్ లో ఉసిరికాయలను తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చిటికెలో నయమవుతాయంటున్నారు నిపుణులు.

చలికాలంలో మన ఆరోగ్యం ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. దగ్గు, జలుబు, జ్వరం, ఫ్లూ తో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్ లో పండే పండ్లను, కూరగాయలను తప్పకుండా తినాలి. ముఖ్యంగా ఉసిరికాయలను, ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి చలికాలంలో మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అజీర్థి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చల్లని వాతావరణంలో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉండే ఉసిరిని ఈ సీజన్ లో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గుతారు
చలికాలంలో ఎక్కువ వేయించిన, ఆయిలీ వంటి రుచికరమైన ఆహారలను ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిని తినడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతారు. బరువు పెరిగితే గుండె జబ్బు నుంచి డయాబెటీస్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సీజన్ లో పుష్కలంగా లభించే ఉసిరికాయలను తినడం వల్ల మీ బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఉసిరికాయల్లో విటమిన్ సితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దగ్గు, జలుబు నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే క్రోమియం ఉసిరికాయలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే మధుమేహులు చలికాలంలో ఉసిరికాయను తప్పకుండా తినాలంటారు డాక్టర్లు. అయినప్పటికీ.. ఇది మెడిసిన్స్ అంత ప్రభావంగా పనిచేయదు. మెడిసిన్స్ కు బదులుగా ఉసిరిని తీసుకోకూడదు. వాటితో పాటుగా తీసుకుంటే మంచిది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సెల్యూలర్ డ్యామేజీ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. అలాగే తాపజనక ట్రిగ్గర్లను తగ్గిస్తాయి. ఉసిరికాయ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే ఉత్తమ ఆహారాల్లో ఒకటి. హార్ట్ పేషెంట్లు ఉసిరికాయను తప్పకుండా తినాలి.
సీజనల్ ఫ్లూను నివారిస్తుంది
సాధారణంగా జబులు, ఫలూలు శీతాకాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. బ్యాక్టీరియాతో పోరాడే శక్తి శరీరానికి లేకపోవడం వల్ల ఇవి తరచుగా వస్తుంటాయి. ఉసిరి జీవక్రియను పెంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనివల్ల ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.