పెరుగు ఫేస్ ప్యాక్ తో మ్యాజిక్.. చర్మం మెరిసిపోతుంది!
life Aug 14 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
చర్మ సౌందర్యానికి పెరుగు
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి తేమను అందిస్తుంది. ఇది ముఖానికి సహజమైన మెరుపును ఇవ్వడమే కాకుండా, చర్మానికి సాగే గుణాన్ని పెంచుతుంది.
Image credits: Getty
Telugu
పెరుగు, కీరదోస
కీర దోసను తురిమి, దానికి పెరుగు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
Image credits: Pinterest
Telugu
పెరుగు, పసుపు మాస్క్
సన్ ట్యాన్‌ను తొలగించుకోవడానికి, చర్మం రంగు మెరుగుపర్చుకోవడానికి ఒక కప్పు పెరుగులో అర చెంచా పసుపు కలపాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది.
Image credits: Pinterest
Telugu
పెరుగు, తేనె మాస్క్
మొటిమలు, మచ్చల నుంచి ఉపశమనం కోసం పెరుగులో ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు క్రమంగా తగ్గుతాయి.
Image credits: Pinterest
Telugu
ఇది మర్చిపోవద్దు
ఏ ఫేస్ ప్యాక్ ఉపయోగించినా, ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు. ఇది చర్మం మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.