MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Career Guidance
  • హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్

హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్

Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేంద్రంగా పనిచేస్తున్న అరేనేషా ఏఐ హబ్ ఆధ్వర్యంలో ‘ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026’ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన రోబోట్ ప్రాజెక్టులు, ఏఐ ఆధారిత ఆవిష్కరణలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 06 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హ్యూమనాయిడ్ రోబోట్‌తో ఆకట్టుకున్న సమ్మిట్
Image Credit : Asianet News

హ్యూమనాయిడ్ రోబోట్‌తో ఆకట్టుకున్న సమ్మిట్

సమ్మిట్‌లో యూనిట్రీ జీ1 (Unitree G1) హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మానవ ఆకృతిలో ఉండే ఈ రోబోట్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు విద్యార్థులు, టెక్నాలజీ ఆసక్తి ఉన్నవారు ఆసక్తి చూపించారు. రోబోటిక్స్ రంగంలో ఆధునిక సాంకేతికత ఎలా అభివృద్ధి చెందుతోందో ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సొంత రోబోట్ ప్రాజెక్టులను కూడా ప్రదర్శించడంతో సమ్మిట్‌లో సాంకేతికతకు సంబంధించిన ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విద్యార్థుల కోసం ఏఐ హ్యాకాథాన్
Image Credit : Asianet News

విద్యార్థుల కోసం ఏఐ హ్యాకాథాన్

కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం రోజంతా ఏఐ హ్యాకాథాన్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు తమ ఆలోచనలను ఏఐ ఆధారిత ప్రాజెక్టులుగా రూపొందించి న్యాయనిర్ణేతల ముందు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడం, కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం, ఏఐ సాధనాలను ఉపయోగించడం వంటి అంశాలపై విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా పుస్తకాల్లో నేర్చుకునే అంశాలను ప్రాక్టికల్‌గా ఉపయోగించే అవకాశం విద్యార్థులకు లభించింది.

34
ఏఐ మనుషులను భర్తీ చేస్తుందా.?
Image Credit : Asianet News

ఏఐ మనుషులను భర్తీ చేస్తుందా.?

అరేనేషా ఏఐ హబ్ ఫౌండర్, సీఈఓ నూతన్ మాట్లాడుతూ ఏఐపై ఉన్న భయాలు, అపోహలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. “ఏఐ మనుషులను భర్తీ చేయదు.. కేవలం పనులను సులభతరం చేస్తుంది. పునరావృతమయ్యే, కష్టమైన పనులను రోబోట్లు చేయగలవు. అయితే మనుషుల సృజనాత్మకత, ఆలోచనా శక్తికి ఎప్పటికీ ప్రాధాన్యం ఉంటుంది. ఏఐతో పోటీ పడటం కంటే.. ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి” అని ఆయన అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్‌పై అవగాహనతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు అవసరం అని ఆయన వివరించారు.

44
2024లో ప్రారంభమైన అరేనేషా ఏఐ హబ్
Image Credit : Asianet News

2024లో ప్రారంభమైన అరేనేషా ఏఐ హబ్

హైదరాబాద్‌లో 2024లో ప్రారంభమైన అరేనేషా ఏఐ హబ్ విద్యార్థులు, బిల్డర్లకు ఫిజికల్ ఏఐ (Physical AI), ఎడ్జ్ ఏఐ (Edge AI) రంగాల్లో శిక్షణ అందిస్తోంది. కొత్త సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలనుకునే వారికి అధునాతన ఏఐ ల్యాబ్‌గా ఇది పనిచేస్తోంది. సంస్థ సీఈఓ నూతన్‌కు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎడ్జ్ ఏఐ, ఫిజికల్ ఏఐ రంగాల్లో 16 ఏళ్ల అనుభవం ఉంది. ‘రోబోఎడిఫై’ (RoboEdify) కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రోబోటిక్స్, ఏఐపై ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నారు. ఈ సమ్మిట్‌లో ఇస్రో ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
ఉద్యోగాలు, కెరీర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.40 వేల స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. విద్యార్థులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్
Recommended image2
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
Recommended image3
UPSC Interview Questions : నిత్యం మండుతూనే ఉంటుంది, కానీ బూడిద ఉండదు.. ఏమిటది?
Related Stories
Recommended image1
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్
Recommended image2
ఈ వాచ్ మీ పిల్ల‌ల‌పై ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతుంది.. జీపీఎస్ ట్రాకింగ్‌తోపాటు ఎన్నో ఫీచ‌ర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved