Government Jobs : నెలకు రూ.86,570 జీతం.. కేవలం పదో తరగతి, ఐటిఐ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
BCPL Recruitment 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అదిరిపోయే ఛాన్స్. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకామ్ చదివిన వాళ్లకోసం కేంద్రం ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.

BCPLలో ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కింద పనిచేసే బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (BCPL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 24 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నంబర్ BCPL-NE/06/2026 విడుదలయ్యింది.
గత నెల సెప్టెంబర్ 10, 2026న ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలయ్యింది. ఈ నెల అక్టోబర్ 9, 2026 వరకు అర్హత గల అభ్యర్థులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే BCPL అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోండి.
డిప్లొమా అర్హతతో BCPLలో జాబ్స్
ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
కెమికల్ ఫోర్‌మెన్ - 3
సివిల్ ఫోర్‌మెన్ - 1
హెచ్‌ఆర్ జూనియర్ సూపరింటెండెంట్ - 1
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫోర్‌మెన్ - 1
కెమికల్ ఆపరేటర్ - 8
ఎలక్ట్రికల్ టెక్నీషియన్ - 3
ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్ - 2
మెకానికల్ టెక్నీషియన్ - 2
వీటితో పాటు కెమికల్ ఆపరేటర్ ట్రైనీ, మెకానికల్ టెక్నీషియన్ ట్రైనీ, అకౌంట్స్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఐటీఐ నుంచి డిగ్రీ వరకు చదివిన వాళ్లకు ఇది మంచి అవకాశం.
బీఎస్సీ, బీకామ్ వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టును బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మారుతాయి.
కెమికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫోర్‌మెన్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి.
కెమికల్ ఆపరేటర్ పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో బీఎస్సీ లేదా కెమిస్ట్రీలో బీఎస్సీ ఆనర్స్ చేసి ఉండాలి.
ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ టెక్నీషియన్ పోస్టులకు టెన్త్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
హెచ్‌ఆర్ జూనియర్ సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీతో పాటు పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో డిప్లొమా ఉండాలి.
అకౌంట్స్ అసిస్టెంట్ ట్రైనీకి 50 శాతం మార్కులతో బీకామ్ పాసై, ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి.
వయోపరిమితి, జీతం వివరాలు
ఫోర్‌మెన్, జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులకు గరిష్ట వయసు 32 ఏళ్లు.
ఆపరేటర్, టెక్నీషియన్, ట్రైనీ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
09.10.2026 నాటికి ఈ వయసును లెక్కిస్తారు.
ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది. దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
శాలరీ
ఇక జీతం విషయానికొస్తే.. ఫోర్‌మెన్, జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.28,500 నుంచి రూ.86,570 వరకు ఇస్తారు.
ఆపరేటర్, టెక్నీషియన్ పోస్టులకు రూ.25,000 నుంచి రూ.81,430 వరకు ఉంటుంది.
ట్రైనీ పోస్టులకు నెలకు రూ.21,000 స్టైపెండ్ ఇస్తారు.
అప్లై చేసుకునే విధానం
రాతపరీక్ష, ఫిజికల్ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
అభ్యర్థులు ముందుగా BCPL అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి BCPL-NE/06/2026 నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. ఒక్కో పోస్టుకు అర్హతలు, వయసు, అనుభవం వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి మీకు ఏ పోస్టు సెట్ అవుతుందో చూసుకుని అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ అందుబాటులో ఉంది.

