MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Jobs
  • Overseas Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్... గవర్నమెంట్ గ్యారంటీతో రష్యాలో ఉద్యోగాలు

Overseas Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్... గవర్నమెంట్ గ్యారంటీతో రష్యాలో ఉద్యోగాలు

Recruitment News : పెద్దపెద్ద చదువులు అవసరం లేదు.. నైపుణ్యం ఉంటే చాలు విదేశాల్లో ఉద్యోగాలు. తెలంగాణ యువతకు ప్రభుత్వ సంస్థ TOMCOM  ఈ అద్భుత అవకాశం కల్పిస్తోంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 06 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విదేశీ ఉద్యోగ అవకాశాలు..
Image Credit : Getty

విదేశీ ఉద్యోగ అవకాశాలు..

Overseas Jobs : విదేశాల్లో ఉద్యోగం చాలామంది యువతీయువకుల కల. అయితే విద్యార్హతలు తక్కువగా ఉండటంతో కొందరు, కేవలం ఐటీ రంగంలోనే మంచి ఉద్యోగాలుంటాయనే అపోహతో మరికొందరు, సరైన సమాచారం లేక ఇంకొందరి ఓవర్సీస్ జాబ్ కల నెరవేరడంలేదు. ఇలాంటివారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది... తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తెలంగాణ యువతకు రష్యాలో ఉద్యోగాలు...
Image Credit : X/tomcom_gmts

తెలంగాణ యువతకు రష్యాలో ఉద్యోగాలు...

రష్యా ప్రస్తుతం తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ తో సుదీర్ఘ కాలంగా జరుగుతున్న యుద్దంతో పాటు దేశంలో యువత తగ్గుదల కూడా ఈ కొరతకు కారణం. అందుకే రష్యాలో విదేశాల నుండి కార్మికులను ఆహ్వానిస్తోంది... ఇందులో భారత్ ముందుంది. భారత్ నుండి లక్షలాదిమంది నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రష్యా సిద్దమయ్యింది... ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది.

TOMCOM అనేది నిరుద్యోగ యువతకు సహకారం అందించే సంస్ధ... తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడంలో ఈ సంస్థ సహాయపడుతుంది. తాజాగా రష్యాలో ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ దేశంలో పైప్ స్ట్రెయిటెనింగ్ ఆపరేటర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... అన్ని అర్హతలుండి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

Related Articles

Related image1
Jobs : బిటెక్ విద్యార్థులకు బంపరాఫర్ ... రూ.50 వేల శాలరీ గవర్నమెంట్ జాబ్స్
Related image2
Jobs: నెల‌కు రూ. 3 ల‌క్ష‌ల జీతంతో ఉద్యోగాలు .. అది కూడా జ‌ర్మ‌నీలో పోస్టింగ్‌. వెంట‌నే అప్లై చేసుకోండి
36
అర్హతలు
Image Credit : Gemini AI

అర్హతలు

రష్యాలో పనిచేసేందుకు సంబంధిత రంగంలో స్కిల్స్ కలిగిన కార్మికులు కావాలి.

1. పైప్ లేదా ట్యూబ్ తయారీ యూనిట్స్ లో పనిచేసిన అనుభవం ఉండాలి.

2. పైప్స్ స్ట్రెయిటెనింగ్ మెషిన్లపై అవగాహన కలిగివుండాలి.

3. మైక్రో మీటర్స్, గేజ్ లు ఉపయోగించే నైపుణ్యం కలిగివుండాలి.

4. హీట్ ట్రీటెడ్ స్టీల్ పైపులపై అవగాహన కలిగివుండాలి.

5. ఫ్యాక్టరీ అనుభవం కలిగిన పైప్ ఫిట్టర్లకు ఇది మంచి అవకాశం.

46
ఏం పనిచేయాలి..?
Image Credit : Gemini AI

ఏం పనిచేయాలి..?

రష్యాలో చమురు & గ్యాస్ ఉత్పత్తి అధికంగా ఉంటుంది... ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది. ఇదే స్థాయిలో తయారీ & ఇంజనీరింగ్ రంగం కూడా ఉంది. ఈ రంగాల్లో పైప్/ట్యూబ్ తయారీ యూనిట్లు చాలా కీలకమైనవి... అందుకే వీటిలో అనుభవం ఉన్న మెషిన్ ఆపరేటర్లకు మంచి డిమాండ్ ఉంది.

పైప్ స్ట్రెయిటెనింగ్ ఆపరేటర్ అంటే స్టీల్ పైపుల తయారీ బాధ్యతలుంటాయి. ఆ పైపుల తయారీ మెషిన్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. పైపు సైజు, నాణ్యత, సెప్టీ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అంటే పరిశ్రమలో నిర్దేశించిన ప్రమాణాలకు తగినట్లు పైపును రూపొందించడమే వీళ్లు చేయాల్సిన పని.

56
శాలరీ
Image Credit : Getty

శాలరీ

పైప్ స్ట్రెయిటెనింగ్ ఉద్యోగులకు రష్యాలో మంచి అవకాశాలున్నాయి. వీరికి నెలకు రూ.72,000 వరకు శాలరీ ఉంటుందని TOMCOM పేర్కొంది. ప్రభుత్వ సంస్థద్వారా నియామక ప్రక్రియ సాగుతోంది కాబట్టి అభ్యర్థులు ఎలాంటి మోసాలకు గురయ్యే అవకాశాలుండవు... మంచి శాలరీ, ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.

66
దరఖాస్తు ప్రక్రియ
Image Credit : TOMCOM website

దరఖాస్తు ప్రక్రియ

రష్యాలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి కలిగివుండి అన్ని అర్హతలుంటే రెజ్యూమ్ tomcom.resume@gmail.com కు పంపించవచ్చు. ఈ పైప్ స్ట్రెయిటెనింగ్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం ఫోన్ నెంబర్ల 9440051452 లేదా 9440051581 కాల్ చేయవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎవరు ఎక్కువ ఫుడ్ తింటారు.. పొడవుగా ఉన్నోళ్లా లేక పొట్టోళ్ళా?
Recommended image2
Pilot Training : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Recommended image3
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Related Stories
Recommended image1
Jobs : బిటెక్ విద్యార్థులకు బంపరాఫర్ ... రూ.50 వేల శాలరీ గవర్నమెంట్ జాబ్స్
Recommended image2
Jobs: నెల‌కు రూ. 3 ల‌క్ష‌ల జీతంతో ఉద్యోగాలు .. అది కూడా జ‌ర్మ‌నీలో పోస్టింగ్‌. వెంట‌నే అప్లై చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved