పదో తరగతి పాసైతే చాలు.. పోటీ పరీక్ష లేకుండా నేరుగా రైల్వే జాబ్స్, వెంటనే అప్లై చేసుకొండి
Indian Railway Jobs : పెద్ద చదువులు అవసరం లేదు… పోటీ పరీక్ష కూడా లేదు… కేవలం పదో తరగతి పూర్తిచేసి, ఐటిఐ చేస్తే చాలు… ఇండియన్ రైల్వేలో ఉద్యోగం పొందవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రైల్వే జాబ్స్ భర్తీ
Railway Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చాలామందికి రైల్వేలో ఉద్యోగం సాధించాలన్నది ఓ కల... అందుకే ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాల కోసమే సన్నద్దం అవుతుంటారు. అలాంటివారికి సూపర్ ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి.
కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా పనిచేసే సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1785 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం…
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18 నవంబర్ 2025
దరఖాస్తు చేసుకోడానికి చివరితేదీ : 17 డిసెంబర్ 2025
అంటే ఈ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి సరిగ్గా నెలరోజుల సమయం ఇచ్చారు. అయితే చివరిక్షణంలో సాంకేతిక, ఇతర కారణాలతో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది.
విద్యా అర్హతలు
అతి తక్కువ విద్యార్హతలతో కూడిన పోస్టులివి. కేవలం 10వ తరగతి (SSC) పరీక్షలో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT నుంచి ఐటీఐ (ITI) పూర్తిచేసివుండాలి. అంటే ఇప్పటికే అభ్యర్థుల వద్ద ఐటిఐ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ అర్హతలుంటే వెంటనే రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసుకొవచ్చు.
వయో పరిమితి
రైల్వే ఉద్యోగాలకు ప్రయత్నించే అభ్యర్థులకు కనీసం 15 ఏళ్ల వయసు నిండివుండాలి. అలాగే 24 ఏళ్లు మించకుండా ఉండాలి (01-01-2026 నాటికి వయసు పరిగణలోకి తీసుకుంటారు). ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబిసి అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు (PwBD) ప్రత్యేక సడలింపులు ఇచ్చారు.
ఎంపిక విధానం
సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో అత్యంత కీలకమైనది ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేయడం. అభ్యర్థులను వారి విద్యా అర్హతల్లో (10వ తరగతి, ఐటీఐ) పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను రెడీ చేస్తారు.. దీని ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులను ఎంపికచేసి తుది ప్రకటన చేస్తారు.
దరఖాస్తు విధానం
అప్లికేషన్ ఫీజు :
ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
మిగతా కేటగిరీల వాళ్లందరూ రూ.100/- అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.
ఎలా అప్లై చేయాలి?
ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ rrcser.co.in ను ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక : అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన అన్ని అర్హతలు, షరతులను పూర్తిగా చదివి, నిర్ధారించుకున్న తర్వాతే ఆన్‌లైన్‌లో అప్లై చేయడం మొదలుపెట్టాలి.

