MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Railway Jobs : కేవలం 10వ తరగతి పాసైతే చాలు రైల్వే జాబ్.. 6500 పోస్టులు, గట్టిగా ట్రై చేస్తే లైఫ్ సెట్

Railway Jobs : కేవలం 10వ తరగతి పాసైతే చాలు రైల్వే జాబ్.. 6500 పోస్టులు, గట్టిగా ట్రై చేస్తే లైఫ్ సెట్

భారతీయ రైల్వే 6,500కు పైగా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. జీతం, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 15 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలే ఉద్యోగాలు
Image Credit : Gemini AI

ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలే ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది లక్షలాది మంది యువత కల. చాలామంది చదువు పూర్తవగానే ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరిపోకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే ఒక మంచి అవకాశం కల్పించింది. డిగ్రీలు, పీజీలు కాదు కేవలం పదో తరగతి పాసైతే చాలు, రైల్వేలో ఉద్యోగం సంపాదించవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 6500కు పైగా ఖాళీ పోస్టుల భర్తీకి (Indian Railways Recruitment 2026) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రారంభంలోనే మంచి జీతం కూడా లభిస్తుంది… కాబట్టి గట్టిగా ట్రై చేస్తే లైఫ్ లో సెటిల్ కావచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రైల్వేలో ఏఏ పోస్టులున్నాయి..?
Image Credit : AI PHOTO

రైల్వేలో ఏఏ పోస్టులున్నాయి..?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 6,565 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ (Technician Grade 1 Signal) పోస్టుకు దరఖాస్తు చేయాలంటే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (B.Sc) లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 (Technician Grade 3) పోస్టుకు పదో తరగతి పాసవడంతో పాటు, NCVT/SCVT గుర్తింపు పొందిన ట్రేడ్‌లో ఐటీఐ (ITI) సర్టిఫికెట్ తప్పనిసరి.

Related Articles

Related image1
Government Jobs : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1.80 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఫుల్ డిటెయిల్స్
Related image2
Jobs : AI జమానాలోనూ ఎంత సేఫ్ జాబ్స్..! ఏవో తెలుసా..?
35
రైల్వే పోస్టుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
Image Credit : Getty

రైల్వే పోస్టుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లో టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test) ద్వారా ఎంపికచేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన (Document Verification), వైద్య పరీక్ష (Medical Test) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు అన్ని దశల్లోనూ అర్హత సాధించడం తప్పనిసరి… అయితేనే జాబ్ ఖాయం అవుతుంది.

45
రైల్వే ఉద్యోగాలకు ఎంపికైతే శాలరీ ఎంతుంటుంది?
Image Credit : Gemini AI

రైల్వే ఉద్యోగాలకు ఎంపికైతే శాలరీ ఎంతుంటుంది?

టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుకు ఎంపికైన వారికి, పే లెవల్ 5 ప్రకారం నెలకు రూ.29,200 ప్రారంభ జీతం ఉంటుంది.

టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుకు ఎంపికైతే, నెలకు రూ.19,900 ప్రారంభ జీతం లభిస్తుంది.

వయోపరిమితి 

టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుకు 18 నుంచి 36 ఏళ్లు

టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

55
రైల్వే ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ
Image Credit : Gemini

రైల్వే ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 29. చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోవడం మంచిది.

ముందుగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ప్రధాన వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in (కేంద్ర రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్)

ఈ వెబ్‌సైట్‌లలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. చివరగా దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
TGPSC Notification 2026 : పవర్ ఫుల్ ఆఫీసర్ జాబ్స్, పదేళ్లలో పక్కా ప్రమోషన్, నెలకు రూ.1,37,050 శాలరీ.. గట్టిగా ట్రై చేస్తే లైఫ్ సెట్
Recommended image2
TGPSC Notification 2026 : బిటెక్ చేస్తేచాలు గవర్నమెంట్ జాబ్.. నెలనెలా లక్షల్లో శాలరీ, ఉన్నత హోదా
Recommended image3
TGPSC Notification 2026 : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలనెలా రూ.1,33,630 శాలరీతో గవర్నమెంట్ జాబ్ మీదే
Related Stories
Recommended image1
Government Jobs : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1.80 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Jobs : AI జమానాలోనూ ఎంత సేఫ్ జాబ్స్..! ఏవో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved