MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Government Jobs
  • Government Jobs Notification 2026 : టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. నెలకు రూ.80 వేల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్

Government Jobs Notification 2026 : టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. నెలకు రూ.80 వేల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్

గవర్నమెంట్ జాబ్ సాధించాలని కలలుగనే యువతకు గుడ్ న్యూస్. కేవలం పదోతరగతి, ఇంటర్మీడియట్ అర్హతలతోనే ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇక్కడ ఫుల్ డిటెయిల్స్ అందిస్తున్నాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Nov 03 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో కొత్త ఉద్యోగాలు
Image Credit : Gemini

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో కొత్త ఉద్యోగాలు

పెద్ద విద్యార్హతలు లేకున్నా గవర్నమెంట్ జాబ్స్ సాధించాలని కలలుగనే యువతకు లక్కీ ఛాన్స్… ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ… కాబట్టి మంచి శాలరీతో పాటు ఇతర సదుపాయాలు లభిస్తాయి. ఈ ఉద్యోగం సాధిస్తే మంచి ఆదాయమే కాదు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది.

స్టోర్ కీపర్ గ్రేడ్-2, ఇంజిన్ డ్రైవర్, లస్కర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, ఎంటీఎస్ లాంటి 5 గ్రూప్-సి పోస్టుల భర్తీకి కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదలచేసింది. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంతో పాటు చెన్నై, మండపం, రామనాథపురం, తూత్తుకుడిలో పోస్టింగ్‌లు ఉంటాయి… అంటే స్వస్థలంలోనే ఉద్యోగాన్ని పొందే అవకాశం తెలుగు యువతకు ఉందన్నమాట. అర్హులైన వాళ్లు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోస్టులు ఏంటి? క్వాలిఫికేషన్స్ ఏంటి?
Image Credit : @IndianCoastGuard

పోస్టులు ఏంటి? క్వాలిఫికేషన్స్ ఏంటి?

స్టోర్ కీపర్ గ్రేడ్-2 పోస్టుకు ఇంటర్ పాసై, ఏడాది పని అనుభవం ఉండాలి.

ఇంజిన్ డ్రైవర్ పోస్టుకు టెన్త్ పాసై, గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్ ఉండాలి.

లస్కర్ పోస్టుకు టెన్త్ పాసై, మూడేళ్ల అనుభవం ఉండాలి.

సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ పోస్టుకు టెన్త్ పాసై, లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

ఎంటీఎస్ పోస్టుకు టెన్త్ పాసై, మెషిన్ షాప్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.

35
జీతం ఎంత? వయోపరిమితి ఎంత?
Image Credit : Gemini AI

జీతం ఎంత? వయోపరిమితి ఎంత?

పోస్టును బట్టి నెలవారీ జీతం ఉంటుంది.

స్టోర్ కీపర్, మోటార్ డ్రైవర్ పోస్టులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు శాలరీ ఉంటుంది.

ఇంజిన్ డ్రైవర్ పోస్టుకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం ఉంటుంది.

లస్కర్, ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఇస్తారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాాలకు దరఖాస్తుచేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

45
సెలెక్షన్ ప్రాసెస్, అప్లై చేసే విధానం
Image Credit : Getty

సెలెక్షన్ ప్రాసెస్, అప్లై చేసే విధానం

ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్లను ముందుగా అర్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు… అనంతరం ఫైనల్ లిస్ట్ విడుదలచేస్తారు..

ఇండియన్ కోస్ట్ గార్డ్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని ఫిల్ చేసి, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టేషన్ చేసి, ఫోటో అతికించాలి. ఈ అప్లికేషన్‌ను నోటిఫికేషన్ లో పేర్కొన్న అడ్రస్‌కు ఆర్డినరీ పోస్ట్‌లో పంపాలి. కవర్ మీద పోస్టు పేరు, రిజర్వేషన్ కేటగిరీ స్పష్టంగా రాయాలి.

55
అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?
Image Credit : X

అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

ఈ పోస్టులకు 2026 నవంబర్ 7 నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు. ఫిల్ చేసిన అప్లికేషన్లు చేరడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 21, 2026. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్లను రెడీగా పెట్టుకోవాలి. అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఉన్న అర్హతలు, వయోపరిమితి, పోస్టుల వివరాలను పూర్తిగా చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. డిగ్రీ చదివితే చాలు రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Related Stories
Recommended image1
Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. డిగ్రీ చదివితే చాలు రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం
Recommended image2
Jobs Notification 2026 : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.1,60,990 జీతంతో గవర్నమెంట్ జాబ్, ఫుల్ డిటెయిల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved