MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Jobs
  • Government Jobs
  • Government Jobs : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1.80 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఫుల్ డిటెయిల్స్

Government Jobs : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1.80 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఫుల్ డిటెయిల్స్

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే మీకు ఇదే అద్భుత అవకాశం. కేంద్ర ప్రభుత్వ మహారత్న సంస్థలో ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

4 Min read
Author : Arun Kumar P
Published : Jun 01 2026, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
Image Credit : Getty

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

Coal India Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే ఈ ఏడాది నుంచి గేట్ (GATE) స్కోర్‌కు బదులుగా, సంస్థ సొంతంగా నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా నియామకాలు జరగనున్నాయి. అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు జూన్ 11, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కోల్ ఇండియా ఉద్యోగ సమాచారం
Image Credit : Getty

కోల్ ఇండియా ఉద్యోగ సమాచారం

సంస్థ : కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)

• పదవి పేరు : మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT)

• ఉద్యోగ గ్రేడ్ : E-1 గ్రేడ్ (ఎగ్జిక్యూటివ్ లెవెల్)

• మొత్తం ఖాళీలు: 660 (CBT విధానంలో ఎంపిక) (ఇవి కాకుండా మైనింగ్ విభాగంలో 276 పోస్టులను GATE ద్వారా భర్తీ చేస్తారు)

• దరఖాస్తు విధానం : కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే

• జీతం వివరాలు : నెలకు రూ.60,000/- నుంచి రూ.1,80,000/- వరకు

• అధికారిక వెబ్‌సైట్ : www.coalindia.in

ముఖ్యమైన తేదీలు (Important Dates)

• నోటిఫికేషన్ విడుదల : 05 మే 2026

• ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం : 12 మే 2026 (ఉదయం 10:00 గంటల నుంచి)

• ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ : 11 జూన్ 2026 (సాయంత్రం 06:00 గంటల వరకు)

• వయోపరిమితిని లెక్కించే తేదీ : 30 ఏప్రిల్ 2026 వరకు

• రాత పరీక్ష (CBT) జరిగే అవకాశం : జూలై 2026 (అంచనా మాత్రమే. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తారు.)

36
కోల్ ఇండియా నోటిఫికేషన్.. విభాగాల వారీగా ఖాళీలు
Image Credit : X/tomcom_gmts

కోల్ ఇండియా నోటిఫికేషన్.. విభాగాల వారీగా ఖాళీలు

వివిధ విభాగాల్లో మొత్తం ఖాళీలు, రిజర్వేషన్ల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

• ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Electrical) - పోస్ట్ కోడ్: 12 (మొత్తం: 221)

• సివిల్ ఇంజనీరింగ్ (Civil) - పోస్ట్ కోడ్: 11 (మొత్తం: 178)

• మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical) - పోస్ట్ కోడ్: 13 (మొత్తం: 145)

• సిస్టమ్స్ (IT / Computer Science) - పోస్ట్ కోడ్: 14 (మొత్తం: 43)

• ఎలక్ట్రానిక్స్ & టెలికాం (E&T) - పోస్ట్ కోడ్: 15 (మొత్తం: 38)

• జియాలజీ (Geology) - పోస్ట్ కోడ్: 16 (మొత్తం: 15)

• ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (Industrial) - పోస్ట్ కోడ్: 17 (మొత్తం: 11)

• రాజ్‌భాషా (హిందీ) - పోస్ట్ కోడ్: 18 (మొత్తం: 5)

• కంపెనీ సెక్రటరీ (CS) - పోస్ట్ కోడ్: 19 (మొత్తం: 4)

(ప్రతీ విభాగంలో UR, EWS, SC, ST, OBC-NCL, PwBD కేటగిరీల వారీగా ఖాళీలు నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.)

గమనిక (మైనింగ్ బ్రాంచ్): మైనింగ్ విభాగానికి చెందిన 276 పోస్టులను ఎప్పటిలాగే గేట్ (GATE) స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తారు. దీనికి దరఖాస్తు గడువు మే 8 నుంచి జూన్ 7 వరకు.

46
కోల్ ఇండియా ఉద్యోగాలకు అర్హతలు, వయోపరిమితి
Image Credit : Getty

కోల్ ఇండియా ఉద్యోగాలకు అర్హతలు, వయోపరిమితి

1. విద్యా అర్హత (Educational Qualification):

జనరల్/OBC/EWS అభ్యర్థులు కనీసం 60% మార్కులతో, SC/ST/PwBD అభ్యర్థులు 55% మార్కులతో అర్హత గల డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

• ఇంజనీరింగ్ విభాగాలు (Civil, Electrical, etc.): సంబంధిత బ్రాంచ్‌లో B.E / B.Tech / B.Sc (Engineering) పూర్తి చేసి ఉండాలి.

• సిస్టమ్స్ (Systems) : CS/ITలో ఫస్ట్ క్లాస్ B.E/B.Tech లేదా ఏదైనా డిగ్రీతో పాటు MCA ఉత్తీర్ణత.

• జియాలజీ (Geology): జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో M.Sc./M.Tech.

• రాజ్‌భాషా (హిందీ): హిందీలో M.A (కనీసం 60% మార్కులతో). డిగ్రీలో హిందీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి.

• కంపెనీ సెక్రటరీ (CS): ఏదైనా డిగ్రీతో పాటు ICSI అసోసియేట్/ఫెలోషిప్ సభ్యత్వం ఉండాలి.

చివరి సంవత్సరం విద్యార్థులు : 2025-26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారి ఫైనల్ ఫలితాలు ఆగస్టు 31, 2026 లోపు వెలువడాలి.

2. వయోపరిమితి (Age Limit - ఏప్రిల్ 30, 2026 నాటికి):

• జనరల్ / EWS అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 30 సంవత్సరాలు.

• వయోపరిమితి సడలింపులు (కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం):

o OBC (NCL): 3 ఏళ్లు (గరిష్ఠం 33 ఏళ్లు)

o SC / ST: 5 ఏళ్లు (గరిష్ఠం 35 ఏళ్లు)

o దివ్యాంగులు (PwBD): ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది.

o కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.

56
కోల్ ఇండియా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
Image Credit : stockPhoto

కోల్ ఇండియా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

కోల్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుకు ఇంటర్వ్యూ లేదు. అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (Document Verification)

3. ప్రాథమిక వైద్య పరీక్ష (Initial Medical Examination - IME)

పరీక్షా సరళి (CBT Pattern):

పరీక్ష 3 గంటల పాటు ఒకే సెషన్‌లో జరుగుతుంది. మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.

• పేపర్-I (100 ప్రశ్నలు/100 మార్కులు): జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్.

• పేపర్-II (100 ప్రశ్నలు/100 మార్కులు): అభ్యర్థి చదివిన సబ్జెక్టుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం.

కనీస అర్హత మార్కులు: రెండు పేపర్లలోనూ వేర్వేరుగా జనరల్/EWS అభ్యర్థులు 40, OBC-NCL 35, SC/ST/PwD అభ్యర్థులు 30 మార్కులు సాధించాలి.

జీతం & సర్వీస్ బాండ్:

• శిక్షణ కాలంలో (1 సంవత్సరం) నెలకు ₹60,000 జీతం ఉంటుంది. శిక్షణ తర్వాత E-2 గ్రేడ్‌లో ₹60,000 - ₹1,80,000 స్కేల్‌లో జీతం, ఇతర అలవెన్సులు ఉంటాయి.

• ఉద్యోగంలో చేరినప్పుడు కనీసం 3 ఏళ్లు పనిచేస్తామని ₹3 లక్షల విలువైన సర్వీస్ బాండ్ సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు:

• జనరల్ / OBC (NCL) / EWS: ₹1180 (₹1000 + ₹180 GST)

• SC / ST / PwBD / కోల్ ఇండియా ఉద్యోగులకు: ఫీజు లేదు.

66
కోల్ ఇండియా ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి?
Image Credit : Getty

కోల్ ఇండియా ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.coalindia.in ఓపెన్ చేయాలి.

2. హోమ్‌పేజీలో "Career with CIL" -> "Jobs at Coal India" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. అక్కడ "CIL MT Recruitment 2026 (Advt No. 03/2026)" అనే లింక్‌ను ఎంచుకోవాలి.

4. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీతో మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

5. ఆ తర్వాత దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత, విద్యా వివరాలను సరిగ్గా నింపాలి.

6. మీ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లను (PDF ఫార్మాట్‌లో) అప్‌లోడ్ చేయాలి.

7. వర్తించే కేటగిరీ వారు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.

8. చివరగా, అన్ని వివరాలు సరిచూసుకొని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.

గమనిక: కేంద్ర ప్రభుత్వ మహారత్న సంస్థలో మంచి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంలో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థులు, చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి
Recommended image3
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే
Related Stories
Recommended image1
SBI Jobs: ఎస్‌బీఐ లో 7150 జాబ్స్.. సొంత జిల్లాలోనే పోస్టింగ్.. వెంటనే అప్లై చేయండి
Recommended image2
Jobs : AI జమానాలోనూ ఎంత సేఫ్ జాబ్స్..! ఏవో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved