MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Jobs
  • Jobs : AI జమానాలోనూ ఎంత సేఫ్ జాబ్స్..! ఏవో తెలుసా..?

Jobs : AI జమానాలోనూ ఎంత సేఫ్ జాబ్స్..! ఏవో తెలుసా..?

Artificial Intelligence (AI) : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నట్లే… ఏఐ విప్లవం కూడా ఇదే సూచిస్తోంది. అయితే ఏఐ ఎంత డెవలప్ అయినా ఏం చేయలేని ఉద్యోగాలు కూడా అనేకం ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : May 30 2026, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
AI ఎఫెక్ట్ లేని జాబ్స్ ఇవే..
Image Credit : Gemini

AI ఎఫెక్ట్ లేని జాబ్స్ ఇవే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఐటీ, టెక్నాలజీతో పాటు అనేక రంగాల్లో AI వినియోగం పెరిగింది... మనుషులు చేయాల్సిన పనిని ఇదే చేస్తోంది. అందుకే చిన్నచిన్న స్టార్టప్స్ నుండి గ్లోబల్ దిగ్గజ సంస్థల వరకు లేఆఫ్స్ కు సిద్దమయ్యాయి... భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఏఐ ఎంత వేగంగా ఎదుగుతున్నా కొన్ని ఉద్యోగాలను మాత్రం అది టచ్ కూడా చేయలేదు. రాబోయే 100 ఏళ్లపాటు 100% భద్రత ఉండే ఆ ఉద్యోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
AI జమానాలో సేఫ్ జాబ్స్ ఇవే..
Image Credit : Getty

AI జమానాలో సేఫ్ జాబ్స్ ఇవే..

ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గురించే చర్చ. చాట్‌జీపీటీ, జెమిని లాంటి టూల్స్ వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి కంటెంట్ రైటర్ల వరకు 'ఉద్యోగం పోతుందేమో?' అని భయపడుతున్నారు. అయితే టెక్నాలజీ అవసరం లేకుండా పక్కా మనుషులు అవసరమయ్యే ఉద్యోగాలు అనేకం ఉన్నాయి. అలాంటివే ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వడ్రంగి వంటి చేతిపనులు.. వీటిని ఏ టెక్నాలజీ, ఏ రోబోలు రీప్లేస్ చేయలేవు. అందుకే కోడింగ్ చేసేవారి కంటే వెల్డర్ లేదా ప్లంబర్ ఉద్యోగం సురక్షితం.

చేతి నైపుణ్యాలదే ఇక హవా

ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు : ప్రతి ఇంటి నిర్మాణం వేరువేరుగా ఉంటుంది... ఒక్కో ఇంట్లో రిపేర్లు వేర్వేరుగా ఉంటాయి. దీనికి అవసరమైన శారీరక నైపుణ్యం, ఆయా ప్రదేశానికి తగినట్లు ఆలోచించే సామర్థ్యం రోబోలకు ఇంకా రాలేదు. అందుకే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు ఏఐతో దోకా లేదు.

నిర్మాణ కార్మికులు & ఆర్కిటెక్ట్‌లు: సైట్ వాతావరణానికి అనుగుణంగా మారే పనులకు మనుషుల ప్రత్యక్ష ప్రమేయం అవసరం. ఇంటికి అవసరమైన నిర్మాణాలు, అందంగా తీర్చిదిద్దేలా చేయడం మనుషులతోనే సాధ్యం. అందుకే నిర్మాణరంగంపై ఏఐ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. 

Related Articles

Related image1
SBI Jobs: ఎస్‌బీఐ లో 7150 జాబ్స్.. సొంత జిల్లాలోనే పోస్టింగ్.. వెంటనే అప్లై చేయండి
Related image2
Jobs: ఉద్యోగ నియామ‌కాల్లో కొత్త ట్రెండ్‌.. అలా రూపొందించిన రెజ్యూమ్‌ల‌కే కంపెనీలు అధిక ప్రాధాన్యం
34
నాయకత్వ బాధ్యతలు (Leadership & Strategy)
Image Credit : Gemini AI

నాయకత్వ బాధ్యతలు (Leadership & Strategy)

సంస్థలను నడిపించే బాధ్యతల్లో AI కేవలం డేటాను మాత్రమే ఇవ్వగలదు.. నిర్ణయాలు తీసుకోలేదు.

సీఈఓలు & బిజినెస్ లీడర్లు : ఒక సంస్థ భవిష్యత్ ప్రణాళిక, సంస్కృతి, మానవ వనరులను (ఉద్యోగులను) నిర్వహించడం వంటి వాటికి నాయకత్వ లక్షణాలు (Leadership) తప్పనిసరి. ఏఐ ఈ పనులు చేయలేదు.

రాజకీయ నాయకులు & పాలసీ మేకర్స్ : చట్టాలు చేయడం, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని పథకాలను అమలు చేయడం వంటి వాటికి సామాజిక అవగాహన అవసరం. అందుకే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా పాలకులుగా మాత్రం మనుషులే ఉంటారు. ప్రభుత్వాలను యంత్రాలు నడిపించలేవు.. పాలన సాంగించలేవు.

44
ఈ రంగాలపై ఏఐ ఎఫెక్ట్ ఉండదు..
Image Credit : Getty

ఈ రంగాలపై ఏఐ ఎఫెక్ట్ ఉండదు..

ఉపాధ్యాయులు & ప్రొఫెసర్లు : AI ఒక పాఠాన్ని చెప్పగలదు, కానీ ఒక విద్యార్థి వ్యక్తిగత ప్రతిభను గుర్తించి, అతడిని ప్రోత్సహించి, మంచి క్రమశిక్షణ నేర్పించే 'గురువు'గా మారలేదు.

స్పోర్ట్స్ కోచ్‌లు : క్రీడాకారుల శారీరక, మానసిక స్థితిని తెలుసుకుని, వారిని ఉత్తేజపరిచి గెలిపించే కళ మనుషులకు మాత్రమే సొంతం. కాబట్టి క్రీడారంగంలో యువత అవసరం ఎప్పటికీ ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎవరు ఎక్కువ ఫుడ్ తింటారు.. పొడవుగా ఉన్నోళ్లా లేక పొట్టోళ్ళా?
Recommended image2
Pilot Training : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Recommended image3
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Related Stories
Recommended image1
SBI Jobs: ఎస్‌బీఐ లో 7150 జాబ్స్.. సొంత జిల్లాలోనే పోస్టింగ్.. వెంటనే అప్లై చేయండి
Recommended image2
Jobs: ఉద్యోగ నియామ‌కాల్లో కొత్త ట్రెండ్‌.. అలా రూపొందించిన రెజ్యూమ్‌ల‌కే కంపెనీలు అధిక ప్రాధాన్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved