- Home
- Jobs
- Private Jobs
- Jobs: తెలంగాణ వారికి పోర్చుగల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం, ఎలా అప్లై చేసుకోవాలంటే
Jobs: తెలంగాణ వారికి పోర్చుగల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం, ఎలా అప్లై చేసుకోవాలంటే
తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు శుభవార్త. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఇంతకీ ఏంటా ఉద్యోగాలు.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పోర్చుగల్‌లో ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రం శ్రమ, ఉపాధి, శిక్షణ అండ్ ఫ్యాక్టరీస్ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా పోర్చుగల్ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అర్హత ఉన్న తెలంగాణ అభ్యర్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవచ్చు.
ఉద్యోగాలు, జీతాలు
పోర్చుగల్‌లో కొన్ని ప్రముఖ ఉద్యోగాలు, అందించే జీతాలు ఇవే:
* F&B మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ – €1500 (దాదాపు ₹1.5 లక్షలు)
* ఎగ్జిక్యూటివ్ చెఫ్ – €1400 (₹1.4 లక్షలు)
* ఈవెంట్స్ కోఆర్డినేటర్ – €1200 (₹1.2 లక్షలు)
* హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్, లైన్/స్టేషన్ కుక్ – €1100 (₹1.1 లక్షలు)
* మెయింటెనెన్స్ టెక్నీషియన్, స్పా థెరపిస్ట్ – €1000 (₹1 లక్ష)
* వేటర్, హౌస్‌కీపర్, కిచెన్ అసిస్టెంట్/డిష్‌వాషర్ – €900 (₹90,000)
అర్హతలు, వయస్సు పరిమితి
* అభ్యర్థుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
* సంబంధిత విభాగంలో 2 నుంచి 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
విద్యార్హతలు
పోస్టుల ఆధారంగా.. పదోన్నతి, ఇంటర్మీడియట్, హోటల్ మేనేజ్‌మెంట్, కలీనరీ ఆర్ట్స్, మార్కెటింగ్ లేదా ఈవెంట్ కోఆర్డినేషన్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.?
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను tomcom.resume@gmail.com ఈమెయిల్‌కి పంపించాలి. అలాగే పూర్తి సమాచారం కోసం 9440052592, 9440049937, 9440051452 నెంబర్లకు సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సహాయంతో విదేశాల్లో ఉద్యోగాలు
TOMCOM ద్వారా ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నియామకాలు సాగుతుండడంతో ఇందులో ఎలాంటి మోసం ఉండదు. సురక్షిత విధానంలో ఉద్యోగాల నియామకం జరుగుతుంది. దీంతో తెలంగాణ యువతకు నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం లభిస్తుంది.