MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: రూ. 1580 కోట్ల పెట్టుబ‌డులు, 8 వేల మందికి ఉద్యోగాలు.. ఏపీలో మ‌రో ఐటీ దిగ్గ‌జం. ఎక్క‌డంటే..

Andhra Pradesh: రూ. 1580 కోట్ల పెట్టుబ‌డులు, 8 వేల మందికి ఉద్యోగాలు.. ఏపీలో మ‌రో ఐటీ దిగ్గ‌జం. ఎక్క‌డంటే..

యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న, ఏపీ పునఃనిర్మాణం ల‌క్ష్య‌మ‌ని అధికారంలోకి వ‌చ్చే ముందు ప‌లుసార్లు తెలిపిన సీఎం చంద్ర‌బాబు ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ఐటీ కంపెనీల‌ను తీసుకొచ్చే దిశ‌గా మ‌రో కీల‌క అడుగు వేశారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 27 2025, 07:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమ‌రావ‌తితో పాటు
Image Credit : our own

అమ‌రావ‌తితో పాటు

ఓవైపు అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల‌ను మొద‌లు పెట్టిన కూట‌మి ప్ర‌భుత్వం. అక్క‌డ క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే టీసీఎస్, ఐబీఎమ్ వంటి కంపెనీల‌తో ఒప్పందం కూడా చేసుకుంది. దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదిలా ఉంటే మ‌రో వైపు విశాఖ‌ను కూడా ఐటీ హ‌బ్‌గా మార్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

25
ఇప్ప‌టికే టీసీఎస్ కంపెనీ
Image Credit : our own

ఇప్ప‌టికే టీసీఎస్ కంపెనీ

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఇప్పటికే విశాఖలో రూ.1370 కోట్ల పెట్టుబడితో ఐటీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా దాదాపు 12 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కంపెనీ తెలిపింది. విశాఖ ఐటీ హిల్స్‌-3లో 22 ఎకరాల భూమిని టీసీఎస్‌కి కేటాయించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Related Articles

Related image1
Gold Price: క్ర‌మంగా త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌లు.. ప్రస్తుతం తులం గోల్డ్ ఎంతో తెలుసా.?
Related image2
TATA Punch EV: రూ. 40 వేలు చెల్లించి ఈ ఎల‌క్ట్రిక్ కారు సొంతం చేసుకోండి.. నెల‌కు ఎంత‌ EMI చెల్లించాలంటే
35
కాగ్నిజెంట్ కూడా
Image Credit : our own

కాగ్నిజెంట్ కూడా

ఇదిలా ఉంటే తాజాగా ప్ర‌ముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖ‌ట‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మూడు దశల్లో క్యాంపస్‌ నిర్మించేందుకు సిద్ధమైంది. రూ.1583 కోట్ల పెట్టుబడితో 8 వేల మందికి ఉద్యోగం కల్పించనున్న ఈ సంస్థకు కాపులుప్పాడలో VMDA పరిధిలోని 22 ఎకరాల స్థలం కేటాయించారు.

తొలి దశలో 800 మంది ఉద్యోగులతో తాత్కాలిక కార్యాలయం ప్రారంభించనుంది. పూర్తి స్థాయి క్యాంపస్‌ 2029 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు.

45
విశాఖ‌నే ఎందుకు ఎంచుకున్నారు.?
Image Credit : getty

విశాఖ‌నే ఎందుకు ఎంచుకున్నారు.?

కాగ్నిజెంట్ సీఈవో రవి కూమార్ మాట్లాడుతూ.. “విశాఖలో మా క్యాంపస్ ప్రారంభించడం మా ప్రయాణంలో కీలక ఘట్టం. టెక్నాలజీ రంగంలో ప్రతిభావంతుల్ని పెంపొందించే దిశగా విశాఖను ఎంచుకున్నాం” అని తెలిపారు. ఐటీ మంత్రి నారా లోకేష్‌ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – ‘‘డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది కీలకమైన అడుగు’’ అని పేర్కొన్నారు.

55
ఐటీ హ‌బ్‌గా మారుతోన్న విశాఖ
Image Credit : Getty

ఐటీ హ‌బ్‌గా మారుతోన్న విశాఖ

ఇప్పటికే గూగుల్‌ సంస్థ మధురవాడ వద్ద 80 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. త్వ‌ర‌లోనే మ‌రికొన్ని ఐటీ కంపెనీలు విశాఖ‌కు క్యూ క‌ట్ట‌నున్నాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. విశాఖ‌ను ముంబై త‌ర‌హాలో అభివృద్ధి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
అమరావతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...
Recommended image2
Now Playing
Kakani Govardhan reddy: చంద్రబాబు క్షమాపణ చెప్పడానికి అభ్యంతరం ఏంటి: కాకాని| Asianet News Telugu
Recommended image3
Now Playing
YSRCP Perni Nani Pressmeet: రాష్ట్రపతి పాలన విధించాలి పేర్ని నాని డిమాండ్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
Gold Price: క్ర‌మంగా త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌లు.. ప్రస్తుతం తులం గోల్డ్ ఎంతో తెలుసా.?
Recommended image2
TATA Punch EV: రూ. 40 వేలు చెల్లించి ఈ ఎల‌క్ట్రిక్ కారు సొంతం చేసుకోండి.. నెల‌కు ఎంత‌ EMI చెల్లించాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved