SSC CGL 2025 : నెలకు లక్షకు పైగా సాలరీతో.. 14,582 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడి, ఎన్ఐఏ లతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఏకంగా 14 వేలకుపైగా ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మీ కలల జాబ్ ను సొంతం చేసుకునే అద్భుత అవకాశం
government jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే యువతకు గుడ్ న్యూస్. భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) ఏకంగా 14,582 ఉద్యోగాల కోసం Combined Graduate Level (CGL) పరీక్షను నిర్వహించేందుకు సిద్దమయ్యింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలచేసి అర్హులైన యువత నుండి అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నారు.
ఎస్సెస్సి సిజిఎల్ ద్వారా భర్తీచేసే ఉద్యోగాలివే
SSC CGL పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తారు. అంటే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆపీసర్, సెక్షన్ హెడ్, ఎగ్జిక్యూటివ్ ఆపీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ట్యాకస్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు.
SSC CGL ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు
అన్ని ఉద్యోగాలకు డిగ్రీయే విద్యార్హత. కానీ కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా కొన్ని సబ్జెక్టులు చదివివుండాలి.
జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ (JSO) : గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి 01-08-2025 నాటికి 60% మార్కులతో డిగ్రీ పూర్తిచేసివుండాలి. ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సబ్జెక్ట్ లేదా స్టాటిస్టిక్స్ చదివివుండాలి.
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 : ఏదైన గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ సబ్జెక్టులతో డిగ్రీ చేసివుండాలి.
రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (NHRC) : గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేయడంతోపాటు కనీసం ఓ సంవత్సరం అయినా రీసెర్చ్ అనుభవం ఉండాలి.
వయో పరిమితి
అభ్యర్థుల వయసు 01/08/2025 నాటికి 18 ఏళ్ల నుండి 32 ఏళ్లలోపు ఉండాలి. అయితే ఒక్కో పోస్టుకు ఒక్కో వయోపరిమితి ఉంది.
అప్లికేషన్ విధానం, ఫీజు
మహిళలు, ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్స్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇతర కేటగిరీ అభ్యర్థులకు రూ.100 ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సిజిఎల్ ఉద్యోగాల దరఖాస్తు కోసం SSC అధికారిక వెబ్ సైట్ www.ssc.gov.in ను విజిట్ చేయండి. మొదట పేరు, పుట్టిన తేదీ, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఆదార్ నంబర్ వంటి వివరాలతో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ నమోదుచేసుకోవాలి. తర్వాత మీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు ఫామ్ ను ఫిల్ చేయాలి.
అవసరమైన విద్యార్హత, ఇతర పత్రాలను సరైన సైజులోకి మార్చి అప్ లోడ్ చేయాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మరోసారి అప్లికేషన్ లోని వివరాలు సరిగ్గా ఉన్నాయోలేదో చూసుకుని సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ ను భవిష్యత్ అవసరాలకోసం ప్రింట్ తీసుకోవాలి.
ఎంపిక విధానం
SSC CGL టైర్ 1 ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ ఆండ్ రీజనింగ్, జనరల్ అవేర్ నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో కేటగిరీకి 50 మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులు.
కంప్యూటర్ బెస్డ్ పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంది. 60 నిమిషాల సమయం ఉంటుంది.
SSC CGL టైర్ 2 పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆండ్ కాంప్రిహెన్షన్ 200 మార్కులు... పేపర్ 3 స్టాటిస్టిక్స్, పేపర్ 4 జనరల్ స్టడీస్ కలిపి 100 మార్కులకు ఉంటుంది. 120 నిమిషాల సమయం ఉంటుంది... నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
సాలరీ
SSC CGL 2025 ద్వారా భర్తీచేసే ఉద్యోగాలను లెవెల్ 4, 5,6,7 గా విభజించారు.
లెవెల్ 4 కింద ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు వస్తాయి. వీరికి రూ.25,500 నుండి రూ.81,100 వరకు జీతం వస్తుంది
లెవెల్ 5 కింద ఆడిటర్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్ రూ.29,200 నుండి 92,300 వరకు సాలరీ వస్తుంది.
లెవెల్ 6 కింద జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్(NIA), ఆపీస్ సూపరిండెంట్ ఉద్యోగాలకు రూ.35,400 నుండి రూ.1,12,400 జీతం వస్తుంది.
లెవెన్ 7 కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్(CBI), అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సెక్షన్ హెడ్ ఉద్యోగాలకు రూ.44,900 నుండి రూ.1,42,400 సాలరీ వస్తుంది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ : జూన్ 9, 2025 (రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం)
దరఖాస్తుకు చివరితేదీ జూలై 5, 2025 (11PM)
అప్లికేషన్ కరెక్షన్ జూలై 9 నుండి 11 వరకు
టైర్ 1 పరీక్ష ఆగస్ట్ 13 నుండి 30 వరకు
టైర్ 2 పరీక్ష డిసెంబర్ లో ఉంటుంది.