MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Jobs
  • Job : రోజూ 5 గంటలే పని.. నెలకు రూ.10 లక్షలు, ఏటా కోటి జీతం..: ఇది కదా జాబ్ అంటే

Job : రోజూ 5 గంటలే పని.. నెలకు రూ.10 లక్షలు, ఏటా కోటి జీతం..: ఇది కదా జాబ్ అంటే

రోజూ కేవలం 5 గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్... కానీ నెలకు దాదాపు రూ.10 లక్షలు, ఏటా కోటి రూపాయలకు పైగా శాలరీ వస్తే.. ఇంతకంటే గొప్ప జాబ్ ఇంకేం ఉంటుంది. ఇలాంటి ఉద్యోగమే చేస్తున్నానని ఓ యువకుడు చేసిన రెడ్డిట్ పోస్ట్ నేటితరం వేతనజీవులను ఆకట్టుకుంటోంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 12 2026, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైరల్ రెడ్డిట్ పోస్ట్..
Image Credit : Gemini

వైరల్ రెడ్డిట్ పోస్ట్..

వారానికి 70 గంటలు అంటే రోజుకు 12-14 గంటలు పనిచేయాలి అని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇటీవల యువతకు సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్నిబట్టి స్పష్టంగా ఓ విషయం అర్థమవుతోంది... ఉద్యోగం అంటే టైమ్ తో పనిలేకుండా పనిచేయాలన్నమాట. రెక్కలుముక్కలు చేసుకుని కష్టపడి చేయాల్సిందేం ఉంటుంది... ఏసీ గదుల్లో దర్జాగా కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే కదా... 12 గంటలు కాదు 24 గంటలైనా చేయవచ్చు... ఇది చాలామంది అభిప్రాయం. అయితే వర్క్ స్ట్రెస్ ఏ స్థాయిలో ఉంటుందో వారికి తెలియదు... ఇటీవల పనిఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళా టెకీ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.

అయితే చాలిచాలని జీతాలతో 12-15 గంటలు పనిచేసే ఉద్యోగులు ఏదైనా మంచి బిజినెస్ చేసుకుంటే బాగుండని భావిస్తుంటారు. అలాంటివారు వెంటనే జాబ్ కు రిజైన్ చేసి బిజినెస్ ప్రారంభించాలి అనిపించేలా ఓ రెడ్డిట్ యూజర్ పోస్ట్ పెట్టాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏడాదికి కోటికి పైగా సంపాదించే జాబ్..
Image Credit : getty

ఏడాదికి కోటికి పైగా సంపాదించే జాబ్..

''జాబ్ టైమింగ్స్ కేవలం ఐదుగంటలే... రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే. ఇంటిదగ్గరే ఆఫీస్... వెళ్ళిరావడానికి ఐదు నిమిషాలే పడుతుంది... అంటే ప్రయాణ సమయం, ఖర్చులు ఆదా. ఇలా చాలా తక్కువ సమయం పనిచేస్తూ ఏడాదికి ఏకంగా రూ.1.1 కోట్లు సంపాదిస్తున్నా'' అంటూ ఓ రెడ్డిట్ యూజర్ పోస్ట్ చేశాడు. తన ఫ్యామిలీ బిజినెస్‌ను చూసుకుంటూ తనకు దొరికిన 'డ్రీమ్' వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి చెప్పి అందరిలో అసూయ, ఆసక్తిని రేకెత్తించాడు.

35
ఇది కదా జాబ్ అంటే..
Image Credit : iSTOCK

ఇది కదా జాబ్ అంటే..

''ఇటీవల మా కుటుంబ వ్యాపారాన్ని నడపడంలో మా నాన్నకు సహాయం చేయడం ప్రారంభించాను. నేను ఉదయం 9:30కి ఆఫీస్‌కు వెళ్లి మధ్యాహ్నం 2:30కి వచ్చేస్తాను. మా నాన్న కూడా అంతే. ఆ తర్వాత మా పని పూర్తయినట్టే. మధ్యాహ్నం 2:30 తర్వాత నాకు నచ్చింది చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఫ్రెండ్స్‌ను కలవడం, సాయంత్రం డ్రైవ్‌కు వెళ్లడం లేదా కుటుంబంతో కలిసి బయట వెళ్లడం వంటివి చేస్తూ నా సమయాన్ని గడుపుతాను'' అని ఆ వ్యక్తి రెడ్డిట్ లో రాసుకొచ్చాడు. అంటే అతడు తండ్రి దగ్గర జాబ్ చేస్తున్నాడన్నమాట.

45
ఇంత లాభమా..!
Image Credit : AI Generated

ఇంత లాభమా..!

''ప్రస్తుతం తమ కుటుంబ వ్యాపారం ద్వారా ఏటా రూ.1.10 కోట్లు వస్తోంది.ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణ కోసం ప్రతి నెలా సుమారు రూ.4-4.5 లక్షలు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి రూ.40-45 లక్షలు. మిగిలిన రూ.60-70 లక్షలు లాభమే... ఈ డబ్బులు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. దీన్నే మేము మా వార్షిక పొదుపుగా భావిస్తాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ జాబ్ లో తనకు పూర్తి స్వేచ్చ ఉంటుందని... పనిఒత్తిడి, మెంటల్ టెన్షన్ ఉండదని చెబుతున్నాడు. ఈ జాబ్ లో బాధ్యత ఉంటుంది... బరువు ఉండదని అంటున్నాడు.

55
నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Image Credit : Getty

నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ రెడ్డిట్ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘రోజుకు 5 గంటలు పనిచేస్తూ ఇంత సంపాదిస్తున్నారు. ఇది ఎవరికి ఇష్టం ఉండదు?’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఫ్యామిలీ బిజినెస్ ఉండటం నిజంగా అదృష్టమే’ అని మరొకరు అన్నారు. ‘మీరు ఏ వ్యాపారంలో ఉన్నారో చెప్పగలరా?’ అని ఇంకో వ్యక్తి అడగ్గా ‘ఎడ్యుకేషన్’ అని పోస్ట్ పెట్టిన వ్యక్తి బదులిచ్చాడు. తమ సంస్థ ఎడ్యుకేషనల్ సెంటర్లను నడుపుతోందని చెప్పాడు.

‘మీరు చాలా అదృష్టవంతులు. మేమంతా రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడినా అంత సంపాదించలేకపోవచ్చు. జీవితాన్ని ఆస్వాదించండి, పేదలకు కూడా కొంత పంచండి’ అని మరో వ్యక్తి సూచించాడు. ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది వ్యక్తిగతం. నేను నా 20 ఏళ్లలో ఉన్నాను, రోజుకు 12 గంటలకు పైగా పనిచేస్తా. 50 ఏళ్లలో ఉండి రోజుకు 18 గంటలు పనిచేసే వాళ్లు కూడా నాకు తెలుసు. అదే వాళ్లకు కిక్ ఇస్తుంది’ అని మరోవ్యక్తి ఆసక్తికర కామెంట్ చేశాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
వ్యాపారం
వైరల్ న్యూస్
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రోసారి ఉద్యోగుల తొల‌గింపున‌కు సిద్ధ‌మైన దిగ్గ‌జ సంస్థ‌.. వేలాది ఉద్యోగాల‌కు ఎస‌రు
Recommended image2
ముంబై, బెంగళూరు కాదు బాసు.. ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఎక్కువగా ఇస్తున్న టాప్ 10 నగరాల ఇవే
Recommended image3
ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
Related Stories
Recommended image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Recommended image2
Business Ideas: తక్కువ పెట్టుబడితో ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. ఎవర్ గ్రీన్ బిజినెస్‌లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved